Home
Mobile

శాంసంగ్‌ గెలాక్సీ రింగ్ కీలక హెల్త్‌ ట్రాకర్ల వివరాలు లీక్.. ఫీచర్‌లు, లాంచ్ పూర్తి వివరాలు..!!

శాంసంగ్ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉత్పత్తుల్లో గెలాక్సీ రింగ్‌ ఒకటి. ఈ రింగ్‌కు సంబంధించిన డిజైన్ సహా కొన్ని ఫీచర్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఈ గెలాక్సీ రింగ్‌ విడుదల తేదీపై ఇప్పటికీ శాంసంగ్‌ స్పష్టత ఇవ్వలేదు. అయితే జులై 10 న నిర్వహించనున్న గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌లో ఈ రింగ్‌ విడుదలపై పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ ఈవెంట్‌లో శాంసంగ్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లు సహా బడ్స్‌, వాచ్‌లను కూడా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ రింగ్‌ పై (Samsung Galaxy Ring) ఇప్పటికే అనేక లీక్‌లు, అంచనా నివేదికలు వచ్చాయి. తాజాగా రింగ్‌ అనేక హెల్త్ ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ అథారిటీ నివేదిక ఆధారంగా త్వరలో అందుబాటులోకి రానున్న శాంసంగ్‌ హెల్త్‌ యాప్ UI.. గెలాక్సీ రింగ్‌ కలిగి ఉన్న హెల్త్ ఫీచర్‌ల వివరాలు వెల్లడించింది. ఈ రింగ్‌ హార్ట్‌ రేట్ సహా ఒత్తిడిని పర్యవేక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Samsung Galaxy ring health trackers trackers leaked

దీంతోపాటు శరీర ఉష్ణోగ్రత సహా మహిళల రుతుచక్రం గురించి కూడా అంచనా వేయగలదని తెలుస్తోంది. గురక గురించి పూర్తి వివరాలను అందించే అవకాశం ఉంది. ఆడియో రికార్డింగ్‌ ద్వారా ఈ వివరాలను గుర్తించే వీలుందని తెలుస్తోంది. ఇందుకు శాంసంగ్ హెల్త్‌ యాప్‌ను కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉండాల్సి ఉంటుంది. గెలాక్సీ వాచ్‌లోనూ ఇదే తరహా ఫీచర్‌లను కలిగి ఉంది.

ఫెర్టిలిటీ ట్రాకింగ్, నిద్ర, రక్ర ప్రసరణ, వైర్‌లెస్‌ పేమెంట్లు సహా అనేక ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. రింగ్ 9 సైజులు, బ్లాక్‌, సిల్వర్‌, గోల్డ్‌ వంటి మూడురంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 2.3 గ్రాముల నుంచి 2.9 గ్రాముల బరువు ఉండే అవకాశం ఉంది. 14.5mAh నుంచి 21.5mAh బ్యాటరీను కలిగి ఉండే అవకాశం ఉంది. 5 నుంచి 9 రోజుల బ్యాటరీ లైఫ్‌తో రానుందని తెలుస్తోంది.

** శాంసంగ్‌ గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ 2024 పై ఇటీవల ప్రకటన వచ్చింది. గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ 2024 జులై 10న పారిస్‌లో జరగనుంది. శాంసంగ్‌ వెబ్‌సైట్‌ (Samsung.com), శాంసంగ్‌ న్యూస్‌ రూం, శాంసంగ్ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా లైవ్‌ చూడవచ్చు. భారత కాలమానం ప్రకారం జులై 10వ తేదీ 6.30PM గంటలకు ఈ లైవ్‌ ప్రారంభం కానుంది.

శాంసంగ్‌ గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ 2024 లో గెలాక్సీ Z ఫోల్డ్‌ 6 మరియు గెలాక్సీ Z ఫ్లిప్‌ 6 విడుదలయ్యే అవకాశం ఉంది. గెలాక్సీ AI తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే ఈవెంట్‌లో గెలాక్సీ బడ్స్‌ 3 సిరీస్‌ పైన ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఈ శాంసంగ్‌ గెలాక్సీ రింగ్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. శాంసంగ్‌ తొలిసారిగా అల్ట్రా మోడల్‌ స్మార్ట్‌ వాచ్‌ ను ఆవిష్కరించే అవకాశం ఉంది. దీంతోపాటు శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ 7 కూడా విడుదలపై ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy ring key health features leaked expected to launch soon in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X