విపణిలోకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్ 2
తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, పంజాబీ, బెంగాలీ, అస్సామీ, మరాఠీ, గుజరాతీ భాషలను సపోర్ట్ చేసే విధంగా సామ్‌సంగ్ కంపెనీ రూపొందించిన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్ 2 ఇండియన్ మార్కెట్లో అధికారికంగా లభ్యమవుతోంది. ఈ మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,990. రెండు కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌ల వద్ద ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480× 800పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
768ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ సపోర్ట్, వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్, ఏజీపీఎస్ కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ బరువు 118 గ్రాములు (8 గంటల టాక్‌టైమ్).
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








