సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యూయోస్ 3@రూ.7,999

Posted By:

బడ్జెట్ ఫ్రెండ్లీ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రోజురోజుకు పెరుగుతున్న పోటీ వ్యాపారం నేపధ్యంలో దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి ‘ఎస్ డ్యూయోస్ 3' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌‍ను భారత్ మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ముంబయ్‌కు చెందిన ప్రముఖ రిటైలర్ (Mahesh Telecom) ఈ పోన్ ఎంఆర్‌పీ ధరను రూ.8590గా పేర్కొంది. అయితే, ఇదే రిటైలర్ గెలాక్సీ ఎస్ డ్యూయోస్ 3 స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేక ధర పై రూ.7,999 విక్రయిస్తోంది.

 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యూయోస్ 3@రూ.7,999

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యూయోస్ 3 (జీ313హెచ్‌యూ) ప్రత్యేకతలు:

3జీ+వీడియో కాలింగ్,
4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని మరింతగా విస్తరించుకునే అవకాశం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
బ్లూటూత్, వై-ఫై, వై-ఫై డైరెక్ట్,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
14 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

ఫోన్ ఎంఆర్‌పీ ధర రూ.8590, స్పెషల్ ధర రూ.7,999.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot