సామ్‌సంగ్ అభిమానులు... మీకు హ్యాపీ న్యూస్?

Posted By: Staff

సామ్‌సంగ్ అభిమానులు... మీకు హ్యాపీ న్యూస్?

సామ్‌సంగ్ అభిమానులను ఎంతగానో ఊరించిన డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్ డ్యూయోస్’ ఈ సెప్టంబర్‌లో భారత్‌కు రాబోతోంది. తొలత ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను యూరోపియన్ మార్కెట్‌లలో విక్రయిస్తారు. డివైజ్ ఫీచర్లను పరిశీలిస్తే..

4 అంగుళాల WVGA టీఎఫ్‌టీ టచ్‌స్ర్కీన్(రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 సింగిల్ కోర్ ప్రాసెసర్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ 2.0 వర్షన్, ప్రీలోడెడ్ సామ్‌సంగ్

చాట్‌ఆన్ సర్వీసెస్. డివైజ్‌లో అమర్చిన 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ సమర్ధవంతమైన బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. డ్యూయల్ సిమ్ సౌలభ్యత ఏకకాలంలో రెండు నెట్‌వర్క్‌లను చేరువచేస్తుంది. ధర అందుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలను సామ్‌సంగ్ అధికారికంగా వెల్లడించలేదు. ఈ నేపధ్యంలో హెచ్‌టీసీ, నోకియా, ఎల్‌జీ వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల నుంచి గెలాక్సీ ఎస్ డ్యూయోస్ గట్టి పోటీని ఎదుర్కొవల్సి ఉంటుందని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

గెలాక్సీ ఎస్3 ఇప్పుడు బ్లాక్ కలర్ వేరియంట్‌లో..!

భారీ అంచనాల మధ్య మే 3న, మార్కెట్లో విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 అదే రీతిలో మార్కెట్‌ను ఆకట్లుకోగలిగింది. ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రెండు నెలల వ్యవధిలోనే కోటి యూనిట్లను అధిగిమించడం ఆశ్చర్యకర పరిణామం.

ఇప్పటి వరకు పెబ్బిల్ బ్లూ, మార్బుల్ వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతున్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 త్వరలో బ్లాక్ కలర్ వేరియంట్‌లో లభ్యంకానుంది. ఈ విషయాన్ని స్వయంగా సామ్‌సంగ్ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీ పై పోస్ట్ చేసింది. మొత్తం మూడు ఫోటోలను సామ్‌సంగ్ తన అఫీషియల్ ఫేస్‌బుక్ పేజీలో ప్రదర్శించింది. సామ్‌సంగ్ తీసుకున్న తాజా నిర్ణయం త్వరలో విడుదల కాబోతున్న ఆపిల్ ఐఫోన్ 5 అమ్మకాల పై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot