'శ్యామ్‌సంగ్ గ్లైడ్' ప్రత్యేకలు, ప్రత్యేకంగా పాఠకుల కొసం...

By Super
|
Samsung Galaxy S Glide
శ్యామ్‌సంగ్ మార్కెట్లోకి ఎప్పటికప్పడు కొత్త ఉత్పత్తలను ప్రవేశపెట్టడంలో దిట్ట. తమ ఉత్పత్తులకు మార్కెట్లో కస్టమర్స్‌ని ఏర్పరచుకొవడం జరిగింది. దీని ఉద్దేశ్యం శ్యామ్ సంగ్ ఉత్పత్తల కొసం ప్రత్యేకంగా కస్టమర్స్ ఎదురు చూడడం అన్నమాట. వారిని దృష్టి పెట్టుకొని మొబైల్ మార్కెట్లోకి శ్యామ్‌సంగ్ కొత్తగా గెలాక్సీ సిరిస్‌కు చెందిన 'శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ గ్లైడ్ స్మార్ట్ ఫోన్'ని విడుదల చేయనుంది. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ గ్లైడ్ స్మార్ట్ ఫోన్‌ని శ్యామ్ సంగ్ ఈ సంవత్సరం చివరకల్లా విడుదల చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది.

ఇక శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ గ్లైడ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే శ్యామ్‌సంగ్ దీనిని హైఎండ్ విభాగంలో విడుదల చేస్తుంది. ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఫెర్పామెన్స్ విషయానికి వస్తే ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 1.2 GHz డ్యూయల్ కొర్ ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీనియొక్క స్క్రీన్ సైజు 4ఇంచ్‌గా రూపొందించడంతో పాటు, స్క్రీన్ రిజల్యూషన్ 480*800 ఫిక్సల్‌గా తయారు చేయడం జరిగింది.

శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ గ్లైడ్ స్మార్ట్ ఫోన్ మిని టచ్ స్క్రీన్ టెక్నాలజీతో మార్కెట్లోకి వస్తుంది. కెమెరా విషయానికి వస్తే మొబైల్ వెనుక భాగాన అమర్చిన 8 మెగా ఫిక్సల్ కెమెరాతో హై క్వాలిటీ ఫిక్చర్స్‌ని తీయవచ్చు. ఇక మొబైల్ ముందు భాగాన ఉన్న 1.3 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తేవచ్చు. ప్రెండ్స్‌తో చాటింగ్ ఈజీగా చేసేందుకు గాను ఇందులో కీబోర్డ్‌ని క్వర్టీ కీబోర్టు మాదిరి రూపొందించారు.

మొబైల్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై-పై లను సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో జిపిఎస్ టెక్నాలజీని నిక్షిప్తం చేయడం జిరిగింది. ఇన్ని అత్యాధునిక ఫీచర్స్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర, ఇతర ప్రత్యేకతలను శ్యామ్‌సంగ్ మార్కెట్లోకి అధికారకంగా విడుదల చేయలేదు. త్వరలోనే శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ గ్లైడ్ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని ప్రత్యేకతలను వన్ ఇండియా మొబైల్ పాఠకులకు తెలయజేయడం జరుగుతుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X