గెలాక్సీ ఎస్ IIIలో 'సూపర్ ప్రాసెసర్'..

Posted By: Staff

గెలాక్సీ ఎస్ IIIలో 'సూపర్ ప్రాసెసర్'..

 

ఇంటర్నెట్లో అందిన సమాచారం ప్రకారం శాంసంగ్ గెలాక్సీ ఎస్ III స్మార్ట్ ఫోన్, శాంసంగ్ కొత్తగా రూపొందించిన 'ఎక్సైనోస్ 4412 ప్రాసెసర్' తో మార్కెట్లోకి విడుదల కానుందని సమాచారం. దీని ప్రత్యేకత ఏమిటంటే స్వతహాగా క్వాడ్ కొర్ ప్రాససెర్ అయిన ఎక్సైనోస్ ఫెర్పామెన్స్ స్పీడ్‌ని 1.5GHz వరకు తీసుకొని వెళుతుంది. ప్రస్తుతం 'ఎక్సైనోస్ 4212 ప్రాసెసర్' టెస్టింగ్ ప్రాసెస్‌లో ఉంది. ఈ ప్రాసెసర్ గనుక మార్కెట్లోకి విడుదలైతే, శాంసంగ్ గెలాక్సీ నెక్సస్ ఫోన్స్ కంటే ధీటుగా శాంసంగ్ గెలాక్సీ ఎస్ III స్మార్ట్ ఫోన్ పని చేస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ III స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇందులో నిక్షిప్తం చేసిన గ్రాఫిక్స్ ప్రాసెసర్ Mali-TS04, గతంలో నిక్షిప్తం చేసిన Mali ప్రాసెసర్ స్పీడ్‌తో పొల్చితే ఐదు సార్లు ఎక్కువ వేగంతో పని చేస్తుంది. 2010వ సంవత్సరంలో Mali ప్రాసెసర్‌ని ARM కంపెనీ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్ III స్మార్ట్ ఫోన్ 2012 ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరిగే మొబైల్ వరల్డ్ కాన్ఫరెన్స్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ II స్మార్ట్ ఫోన్ ఎక్సైనోస్ 4210తో పాటు, 1.2 GHz డ్యూయల్ కొర్ ప్రాసెసర్‌తో రన్ అవుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా కొత్త కొత్త టెక్నాలజీను కంపెనీలు ప్రవేశపెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొవడం జరుగుతుంది. అదే విధంగా శాంసంగ్ విడుదల చేయనున్న ఈ

'ఎక్సైనోస్ 4412 ప్రాసెసర్' క్వాడ్ కొర్ డిజైన్‌తో వస్తుందని రూమర్స్ వస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్ III స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్‌విచ్ ఆపేరటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతూ, 12 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉంది.

ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ ఎస్ II స్మార్ట్ ఫోన్ ఎక్సైనోస్ 4210 ప్రాసెసర్‌కి లేటెస్ట్ వర్సన్‌గా 'ఎక్సైనోస్ 4412 ప్రాసెసర్' ని విడుదల చేయనున్నారు. ఈ ప్రాసెసర్ మార్కెట్లోకి రావడం వల్ల 'NVIDIA’s Tegra 3' క్వాడ్ కొర్ ప్రాససెర్‌కి గట్టి పొటీనిస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ III స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు:

* Android 4.0 Ice Cream Sandwich

* dual-core, 1.8-GHz Samsung Exynos 4412 processor

* 4.6-inch Super AMOLED Plus HD touchscreen display (non-curved)

* 2 GB of RAM

* 12-megapixel primary camera (with W750 BSI CMOS sensor)

* LTE connectivity

* Near Field Communication (NFC) support

* thinner than the Galaxy S II

* 4 physical buttons

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot