గెలాక్సీ ఎస్4 పై మరో రూమర్!

సామ్‌సంగ్ నుంచి భారీ అంచనాలతో విడుదల కాబోతున్న గెలాక్సీ ఎస్4 కు సంబంధించి మరో జ్యూసీ రూమర్ వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది. ఏప్రిల్‌లో విడుదల కాబోతున్న ఈ ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్ ఎస్-పెన్ సపోర్ట్‌ను కలిగి ఉంటుందని సామ్‌సంగ్ అధికారి ఒకరు పేర్కొన్నట్లు ఈ రూమర్ సారాంశం. ఈ సమాచారం నిజమైనట్లయితే ఎస్-పెన్ ఫీచర్ కలిగిన తొలి స్మార్ట్‌ఫోన్‌గా గెలాక్సీ ఎస్4 రికార్డుల్లో నిలుస్తుంది.
గెలాక్సీ ఎస్4 స్పెసిఫికేషన్‌లు (అనధికారికంగా):
5 అంగుళలా స్ర్కీన్,
1080 పిక్సల్ ఆమోల్డ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్-కోర్ ఎక్సినోస్ ఎస్440 చిప్ (28ఎన్ఎమ్ హై-కె మెటల్ గేట్ టెక్నాలజీ),
13 మెగా పిక్సల్ రేర్ ఆటో ఫోకస్ కెమెరా.
ఎస్4లో లేజర్ కీబోర్డ్ (మరో రూమర్)
2013కుగాను సామ్‌సంగ్ ప్రతిష్టాత్మకంగా విడుదల చేయబోతున్న స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్4’పై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గెలాక్సీ ఎస్3కి సక్సెసర్ వర్షన్‌గా విడుదలకాబోతున్న ఈ హ్యాండ్‌సెట్ పై భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ హాటెస్ట్ గాడ్జెట్‌కు సంబంధించి తాజాగా బహిర్గతమైన ఓ వీడియో గెలాక్సీ ఎస్ (జీటీ-ఐ9500) ఫీచర్లను ఈ క్రింది విధంగా పేర్కొంది. భారీ అంచనాలతో విడుదల కాబోతున్న గెలాక్సీ ఎస్4 లేజర్ కీబోర్డ్ ఫీచర్‌ను కలిగి ఉండటం విశేషం….
రోజిట్ కిడ్ వెలవరించిన వివరాల మేరకు గెలాక్సీ ఎస్4 స్పిషికేషన్‌లు:
అల్ట్రా సిమ్, లైటెస్ట్,
1080 పిక్సల్ గ్రాండ్ ఆమెల్డ్ డిస్‌ప్లే,
13 మెగా పిక్సల్ కెమెరా,
2గిగాహెట్జ్ 4 క్వాడ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 5.0 కీ లైమ్ పీ ఆపరేటింగ్ సిస్టం,
లేజర్ కీబోర్డ్.


Click it and Unblock the Notifications








