Home
Mobile

6 కెమెరాలతో సామ్‌సంగ్ 5జీ ఫోన్, 2019లోనే లాంచ్?

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో ఎంతటి పాపులారిటీని సొంతం చేసుకున్నాయో మనందరికి తెలుసు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో ఎంతటి పాపులారిటీని సొంతం చేసుకున్నాయో మనందరికి తెలుసు. తాజాగా ఈ సిరీస్ నుంచి గెలాక్సీ ఎస్10 (Galaxy S10) రాబోతోంది. ఈ హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్ డివైస్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని గతంలో పలు రూమర్స్ వినిపించిన విషయం తెలిసిందే.

గెలాక్సీ ఎస్10కు సంబంధించిన 4వ వేరియంట్...

గెలాక్సీ ఎస్10కు సంబంధించిన 4వ వేరియంట్...

తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించి మరో లేటెస్ట్ రూమర్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే, గెలాక్సీ ఎస్10కు సంబంధించిన 4వ వేరియంట్ కూడా గుట్టు చప్పుడు కాకుండా తయారవుతోందట. ఈ స్పెషల్ వేరియంట్‌లో 5జీ కనెక్టువిటీతో పాటు 6 కెమెరా సెన్సార్స్ ఉంటాయట. డిస్‌ప్లే సైజ్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ స్ర్కీన్ సైజ్ ఏకంగా 6.7 అంగుళాలుగా ఉంటుందట. ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్ ఎక్స్ఎస్ మాక్స్‌తో పోలిస్తే ఈ డిస్‌ప్లే పెద్దదిగా ఉండటం విశేషం. ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌లో ఎక్సినోస్ 9820 సాక్‌ను సామ్‌సంగ్ వినియోగించబోతున్నట్లు సమాచారం.

 

 

వాల్ స్ట్రీట్ జనరల్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం గెలాక్సీ ఎస్10....

వాల్ స్ట్రీట్ జనరల్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం గెలాక్సీ ఎస్10....

వాల్ స్ట్రీట్ జనరల్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం గెలాక్సీ ఎస్10 రేంజ్ ‘బియాండ్ ఎక్స్' అనే కోడ్ నేమ్‌తో రూపుదిద్దుకుంటోంది. ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్‌ను ఐఫోన్ ఎక్స్ తరహాలో 10వ వార్షికోత్సవం సందర్భంగా సామ్‌సంగ్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. 5జీ కనెక్టువిటీతో రాబోతోన్న ఈ స్పెషల్ ఎడిషన్‌లో ఏకంగా 6 కెమెరాలు ఉండబోతున్నాయట. వీటిలో రెండు కెమెరాలు ఫోన్ ముందు భాగంలో ఉంటే, మిగిలిన నాలుగు కెమెరాలు మాత్రం ఫోన్ వెనుక భాగంలో ఎక్విప్ అయి ఉంటాయట.

ఈ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసే క్రమంలో....

ఈ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసే క్రమంలో....

ఈ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసే క్రమంలో దక్షిణకొరియాలోని మొబైల్ క్యారియర్లతో పాటు అమెరికాలోని వెరిజోన్, ఏటీ&టీ, టీ-మొబైల్ వంటి నెట్‌వర్క్ క్యారియర్లతో సామ్‌సంగ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు వాల్ స్ట్రీట్ జనరల్ పేర్కొంది.

వాస్తవరూపాన్ని అద్దుకోబోతోన్న సామ్‌సంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్..

వాస్తవరూపాన్ని అద్దుకోబోతోన్న సామ్‌సంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్..

సామ్‌సంగ్ భవిష్యత్ ఆవిష్కరణల్లో ఒకటైన గెలాక్సీ ఎక్స్ త్వరలో వాస్తవరూపాన్ని అద్దుకోబోతోంది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ గురించి గత కొంత కాలంగా అనేక రూమర్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా తెలియవచ్చిన సమచారం ఈ ఫోన్‌కు సంబంధించిన ఫైనల్ ప్రొటోటైప్ తుది మెరుగులు దిద్దుకుంటోంది. త్వరలోనే ఈ ప్రోటోటైప్ ప్రపంచానికి పరిచయం కాబోతోంది. Bloomberg రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం ఈ ఫోల్డబుల్ ఫోన్‌కు సంబంధించి ఓ స్పెషల్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను సామ్‌సంగ్ అభివృద్థి చేయిస్తోందట. ఇందుకుగాను గూగుల్‌తో కలిసి సామ్‌సంగ్ పనిచేస్తోంది.

 

 

విన్నర్ అనే కోడ్ నేమ్‌తో...

విన్నర్ అనే కోడ్ నేమ్‌తో...

విన్నర్ అనే కోడ్ నేమ్‌తో డిజైన్ కాబడుతోన్న ఈ ఫోల్డబుల్ ఫోన్‌ కోసం గూగుల్ ఎటువంటి ఓఎస్‌ను అభివృద్థి చేస్తోంది అనేదాని పై ఇంకా స్పష్టత లేదు. బ్లూమ్‌బర్గ్ రివీల్ చేసిన మరికొన్ని వివరాల ప్రకారం సామ్‌సంగ్ విన్నర్, 4 అంగుళాల స్ర్కీ‌న్‌తో రాబోతోంది. 200 గ్రాముల బరువును కలిగి ఉండే ఈ ప్రోటోటైప్ డివైస్‌లో బెండింగ్ మెకనిజం కారణంగా ఇన్-స్ర్కీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది ఉండదట. గెలాక్సీ ఎస్10తో పాటు ఈ ప్రోటోటైప్ డివైస్‌ను 2019లో ప్రదర్శించే అవకాశముందని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S10 Top-End Variant to Have 5G Support, 6 Cameras, Display Larger than iPhone XS Max: Report.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X