అందరూ ఇష్టపడుతున్నారని..?

Posted By: Prashanth

అందరూ ఇష్టపడుతున్నారని..?

 

ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రజాదరణను చొరగున్న ‘శామ్‌సంగ్’అనతి కాలంలోనే ‘ఆపిల్’ను అధిగమించే స్థాయికి ఎదిగింది. ఈ బ్రాండ్ సక్సెస్ రేట్ ప్రస్తుత టెక్ మార్కెట్‌లో హాట్ టాపిక్. ఆధునిక సాంకేతికతకు మన్నికను జోడిస్తూ శామ్‌సంగ్ డిజైన్ చేస్తున్న ప్రతి గ్యాడ్జెట్ హాట్ కేకులా అమ్ముడుపోతుంది.

ఇటీవల కాలంలో గెలక్సీ సిరీస్ నుంచి శామ్‌సంగ్ విడుదల చేసిన ‘ఎస్2’ స్మార్ట్ మొబైల్‌కు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు ఈ మొబైల్ వాడకందారులు పెరుగుతూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో శామ్‌సంగ్ సరికొత్త ఫోన్ కమ్ టాబ్లెట్ ‘శామ్‌సంగ్ గెలక్సీ నోట్’ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

‘గెలక్సీ నోట్’కు మార్కెట్లో విశేష ఆదరణ లభిస్తున్నప్పటికి, ‘గెలక్సీ ఎస్2’కు ఏ మాత్రం క్రేజ్ తగ్గటం లేదు. ఈ అంశాన్ని పరిగణంలోకి తీసుకున్న శామ్‌సంగ్ గెలక్సీ ఎస్2 కు అపడేటెడ్ వర్షన్‌గా గెలక్సీ ఎస్2 హై డెఫినిషన్ స్మార్ట్ మొబైల్‌ను డిజైన్ చేసినట్లు బ్రిటీష్ రిటైల్ స్టోర్ ‘మొబిసిటీ’ వెల్లడించింది.

శామ్‌సంగ్ గెలక్సీ ఎస్2 ఫీచర్లు:

* 4.5 ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, * ఆండ్రాయిడ్ v2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * శక్తివంతమైన ప్రాసెసర్, * మన్నికైన బ్యాకప్ నిచ్చే లయోన్ 1850 mAh బ్యాటరీ.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting