సామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు(2013)!

Posted By:

 సామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు(2013)!

నిత్యం కొత్త ఆవిష్కరణలతో వార్తల్లో నిలిచే సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ త్వరలో విడుదల చేయబోతున్నస్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి కీలక సమాచారం నెట్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే..... గెలాక్సీ ఎస్2 ప్లస్, గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్ మోడళ్లలో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను సామ్‌సంగ్ 2013 ప్రధమాంకంలో అందుబాటులోకి తేనున్నట్లు బ్లాగ్ ఆఫ్ మొబైల్ రిపోర్టులు ఉటంకించాయి. గెలాక్సీ ఎస్2 ప్రేరణతో గెలాక్సీ ఎస్2 ప్లస్ రూపుదిద్దుకున్నట్లు సదరు నివేదిక తేటతెల్లం చేస్తోంది. మరో వైపు బఫిన్ కొడ్ నేమ్‌తో రూపుదిద్దుకుంటున్న గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్, ఛాయా చిత్రంతో సహా పలు కీలక స్పెసిఫికేషన్‌లను బ్లాగ్ ఆఫ్ మొబైల్ వెలువరించింది. స్సెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి.......

- 5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

- క్వాడ్‌కోర్ సామ్‌సంగ్ ఎక్సినోస్ 4412 ప్రాసెసర్,

- ఆండ్రాయిడ్ 4.1.1 జెల్లీబీన్ ప్లాట్‌ఫామ్,

- నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ),

- 3జీ, ఎల్టీఈ కనెక్టువిటీ,

- 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

జనవరి మూడో వారంలో గెలాక్సీ ప్లస్:

డార్క్ బ్లూ ఇంకా చిక్‌వైట్ కలర్ వేరియంట్‌లతో కూడిన గెలాక్సీ ఎస్2 ప్లస్‌లను 2013 మొదటి త్రైమాసికంలో అందుబాటులోకి తెచ్చేందుకు సామ్‌సంగ్ సన్నాహాలు చేస్తున్నట్లు బ్లాగ్ ఆఫ్ మొబైల్ నివేదికులు పేర్కొన్నాయి. చిక్‌వైట్ వేరియంట్‌తో కూడిన గెలాక్సీ ఎస్2 ప్లస్‌ను జనవరి మూడో వారం నుంచి అందుబాటులోకి రానున్నట్లు బ్లాక్ వెల్లడించింది. స్పెసిఫికేషన్‌లు:

- 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్,

- ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

- నేచర్ ఎన్ఎక్స్ ఇంటర్ ఫేస్.

ధర అంచనా.......

గెలాక్సీ ఎస్2 ప్లస్: $250 నుంచి $350 మధ్య ( రూ.14,000 నుంచి రూ.20,000 మధ్య),

గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్: 800,000 won నుంచి 100,000 won (రూ.41,000 నుంచి రూ.51,000 మధ్య).

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot