ఆగస్టు చివరికల్లా ఇండియాలో శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 వైట్

By Super
|
గత కొన్నినెలలుగా శ్యామ్‌సంగ్ గ్లోబల్ హ్యాండ్ సెట్ మొబైల్ మార్కెట్లో మంచి సేల్స్ ఫిగర్స్‌ని నమోదు చేయడం కోసం తాపత్రయపడుతుంది. ముఖ్యంగా మనం చూసినట్లైతే శ్యామ్‌సంగ్ గెలాక్సీ సిరిస్ మొబైల్స్ మార్కెట్లో మంచి అమ్మకాలను నమోదు చేయడం జరిగింది. ఇటువంటి సమయంలో శ్యామ్‌సంగ్ కంపెనీ కస్టమర్స్ ని క్యాష్ చేసుకునేందుగాను గెలాక్సీ సిరిస్‌లో మరికొన్ని లెటేస్ట్ మోడల్స్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. అందులో భాగంగానే శ్యామ్‌సంగ్ గెలాక్సీ సిరిస్‌లో బాగా పాపులర్ పోందిన శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 వైట్ మొబైల్‌ని త్వరలో మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది.

శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 వైట్ మొబైల్‌ని 2011 ఆగస్టు చివరికల్లా స్టోర్స్‌లలో ప్రవేశపట్టనుందని సమాచారం. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 సిరిస్ మొబైల్ ఫోన్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని కూడా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2లో ఏమేమి ఫీచర్స్ ఐతే ఉన్నాయో సరిగ్గా అలాంటి ఫీచర్సే శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 వైట్‌లో కూడా పోందుపరచడం జరిగింది. ఒక్క కలర్ విషయంలోనే తేడా ఉంది. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 మొబైల్ ఫోన్స్‌లలో ఏమేమి పనితీరు ఉంటుందో సరిగ్గా అలాంటి పనితీరునే శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 వైట్ కూడా చేస్తుంది.

ఇక శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 వైట్ ఫీచర్స్ విషయానికి వస్తే 4.3 ఇంచ్ సూపర్ AMOLED డిస్ ప్లేని కలిగి ఉండి, హై డేఫినేషన్ వీడియోస్, ఇమేజిలను చక్కని రిజల్యూషన్‌తో అందిస్తుంది. ఇందులో రన్ అయ్యేటటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బర్డ్ వర్షన్. మల్టీ టాస్కింగ్ పనులను చాలా వేగవంతంగా చేసేందుకు గాను ఇందులో 1.2 GHz ప్రాసెసర్‌ని 768 MB RAMని పోందుపరచడం జరిగింది. ఈ రెండింటి కాంబినేషన్‌తో శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 వైట్ ఫోన్ చాలా ఫాస్ట్‌గా పనిచేస్తుంది.

శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 వైట్ మల్టీమీడియా ఫీచర్స్ కూడా చాలా అధ్బుతంగా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తాయి. ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో 8 మెగా ఫిక్సల్ పవర్ పుల్ కెమెరాని పోందుపరచడం జరిగింది. ఈ కెమెరాతో 1080p హై డెఫినేషన్ వీడియో రికార్డింగ్‌ని తీయవచ్చు. 3జి నెట్ వర్క్ వీడియో కాలింగ్ కోసం ప్రత్యేకంగా మొబైల్ ముందు భాగంలో 1.3 మెగా ఫిక్సల్ కెమెరా అమర్చబడి ఉంది. కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీలు అయిన బ్లూటూత్, వై-పై, యుఎస్‌బి సింక్ లాంటివాటన్నింటిని సపోర్ట్ చేస్తుంది. 2జి ఇంటర్నెట్ టెక్నాలజీలు అయిన GPRS, EDGEలను కూడా సపోర్ట్ చేస్తుంది. 21 Mbps స్పీడ్‌తో డేటాని 3జి నెట్ వర్క్ కనెక్టివిటీకి ట్రాన్పర్ చేస్తుంది.

Samsung Galaxy S2 White features:

1.2 GHz processor
Android Gingerbread OS
8 Mega Pixel camera with 1080p video recording
Up to 32 GB of expandable memory
Multi format music and video playback
Java support

ఇన్న రకాలైన అత్యాధునికి ఫీచర్స్ ఉన్నటువంటి శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 వైట్ మొబైల్ ధర సుమారుగా ఇండియన్ మార్కెట్లో రూ 32000 వరకు ఉండవచ్చునని నిపుణులు అంచనా.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X