Galaxy S20, S20+, 5G Support ఫోన్‌లు ఎలా ఉన్నాయో లుక్ వేసుకోండి!!!!

|

శాన్ ఫ్రాన్సిస్కోలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో శామ్సంగ్ గెలాక్సీ S20, గెలాక్సీ S20+ మరియు గెలాక్సీ S20 అల్ట్రాలను ఆవిష్కరించింది. ఈ మూడు ఫోన్‌లు శామ్‌సంగ్ నుండి వచ్చిన టాప్-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లు.

హై-ఎండ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్

హై-ఎండ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కంపెనీకి ఇవి చాలా ప్రధానమైనవి. ఈ మూడు ఫోన్‌ల లభ్యత మరియు దేశ-నిర్దిష్ట లాంచ్‌లు ముందు ముందుగా జరుగుతాయి. ఈ మూడు ఫోన్‌లు త్వరలో అమ్మకాలకు వెళ్ళే మొదటి కొన్ని మార్కెట్లలో భారత్ ఒకటి.

గెలాక్సీ S20 సిరీస్‌

శామ్‌సంగ్ ఈ కార్యక్రమంలో గెలాక్సీ S20 సిరీస్‌తో పాటుగా గెలాక్సీ బడ్స్ ను కూడా పరిచయం చేసింది. దీనికి ముందు గెలాక్సీ S10 సిరీస్‌తో ప్రజలకు అందించింది. గెలాక్సీ ఎస్ 20, గెలాక్సీ ఎస్ 20 + మరియు గెలాక్సీ ఎస్ 20 అల్ట్రాలు కెమెరా మరియు డిస్ప్లే ల పరిమాణంలో ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

Samsung Galaxy S20 5G: శామ్‌సంగ్ 5G ఫోన్‌లు... ధర కాస్త ఎక్కువే...Samsung Galaxy S20 5G: శామ్‌సంగ్ 5G ఫోన్‌లు... ధర కాస్త ఎక్కువే...

ధరల వివరాలు

ధరల వివరాలు

శామ్‌సంగ్ సంస్థ లాంచ్ చేసిన మూడు ఫోన్‌లలో గెలాక్సీ S20 అల్ట్రాలో 6.9 అంగుళాల అతిపెద్ద డిస్ప్లే ను కలిగి ఉండడమే కాకుండా గరిష్ట మొత్తంలో 16GB ర్యామ్ ను కలిగి ఉంటుంది. దీని యొక్క ధర కూడా కాస్త ఖరీదైనదిగా ఉంది. గెలాక్సీ S20 అల్ట్రా ఫోన్ $1,399 (Rs. 99,800) వద్ద ప్రారంభమవుతుండగా గెలాక్సీ S20+ యొక్క ధర $1,199 (Rs. 85,500) ప్రారంభ ధర వద్ద లభిస్తుంది. జాబితాలో అత్యంత సరసమైనది గెలాక్సీ S20 స్మార్ట్ ఫోన్ $999 (Rs.71,300) ధర వద్ద ప్రారంభమవుతుంది.శామ్‌సంగ్ గెలాక్సీ S20 సిరీస్ మార్చి 6 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి లభిస్తుందని కంపెనీ తెలిపింది.

 

 

Jio వాడుతున్నారా? ఈ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోండి...Jio వాడుతున్నారా? ఈ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోండి...

గెలాక్సీ S20 స్పెసిఫికేషన్స్

గెలాక్సీ S20 స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ కంపెనీ యొక్క మూడు ఫోన్‌లలో శామ్సంగ్ గెలాక్సీ S20 చిన్నది. ఇది 151.7x69.1x7.9mm కొలతల పరిమాణంలో 6.2-అంగుళాల ఇన్ఫినిటీ-ఓ డైనమిక్ అమోలేడ్ 2 ఎక్స్ డిస్‌ప్లేను 163 గ్రాముల బరువుతో కలిగి ఉంటుంది. ఇందులో QHD (1,440x3,200 పిక్సెల్స్) రిజల్యూషన్ మరియు పిక్సెల్ కౌంట్ 563pp వద్ద ప్రదర్శిస్తుంది. ఇది HDR10 ధృవీకరించబడింది మరియు 120Hz యొక్క అధిక రిఫ్రెష్ రేటుకు మద్దతు ఇస్తుంది.

 

 

టీవీ వినియోగదారులకు శుభవార్త, ధరలు మారనున్నాయిటీవీ వినియోగదారులకు శుభవార్త, ధరలు మారనున్నాయి

ప్రాసెసర్‌

ప్రాసెసర్‌

శామ్సంగ్ గెలాక్సీ కొత్త ఫోన్లు 7nm ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. మీరు ఎంచుకున్న మోడల్‌ను బట్టి ఇవి శామ్‌సంగ్ ఎక్సినోస్ 990 SoC (S20- రెండు ఎక్సినోస్ M5 కోర్ 2.73GHz వద్ద క్లాక్ చేయబడింది,S20+ - రెండు కార్టెక్స్- A76 కోర్లు క్లాక్ చేయబడ్డాయి 2.5GHz వద్ద, మరియు S20 అల్ట్రా- నాలుగు కార్టెక్స్- A55 కోర్లు 2GHz వద్ద క్లాక్ చేయబడ్డాయి). అలాగే ఇవి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC ( S20- కార్టెక్స్- A77 కోర్ 2.84GHz వద్ద క్లాక్ చేయబడింది. S20+ - మూడు కార్టెక్స్- A77 కోర్లు 2.42GHz వద్ద క్లాక్ చేయబడ్డాయి మరియు S20 అల్ట్రా - నాలుగు కార్టెక్స్- A55 కోర్లు మరియు 1.8GHz వద్ద క్లాక్ చేయబడి ఉన్నాయి.

 

OnePlus 8 Pro: బ్రహ్మాండమైన ఫీచర్స్ ఇవే... ఈ ధర విభాగంలో గట్టి పోటీOnePlus 8 Pro: బ్రహ్మాండమైన ఫీచర్స్ ఇవే... ఈ ధర విభాగంలో గట్టి పోటీ

సెన్సార్

సెన్సార్

గెలాక్సీ S20 LTE వెర్షన్ కోసం 8 GB లేదా 12 GB (5 జి వేరియంట్ మాత్రమే) LPDDR5 ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్‌తో వస్తుంది. తరువాత మెమొరీని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించే అవకాశం ఉంది. బయోమెట్రిక్ యాక్సిస్ కోసం అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు పేస్ లాక్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. గెలాక్సీ S20 సిరీస్ IP68 డస్ట్ మరియు వాటర్ ప్రూఫ్ తో ధృవీకరించబడింది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో మరియు ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0తో 4,000mAh బ్యాటరీని ప్యాక్ చేయబడి వస్తుంది.

 

 

Vodafone Rs 555 Plan ప్రయోజనాలు ఏంటో చూడండిVodafone Rs 555 Plan ప్రయోజనాలు ఏంటో చూడండి

కెమెరాలు

కెమెరాలు

కెమెరాలు విషయంలో ఇవి ముందు వాటి కంటే అప్‌గ్రేడ్ చెంది ఉన్నాయి. గెలాక్సీ S20 లో వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెట్ అప్ ను కలిగి ఉన్నాయి. ఇందులో ఎఫ్ / 1.8 ఎపర్చరుతో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ , f / 2.2 ఎపర్చరుతో 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, మరియు f / 2.0 ఎపర్చరుతో 64 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాలను కలిగి ఉన్నాయి. కొత్త కెమెరా యొక్క ఫీచర్లలో 3x హైబ్రిడ్ ఆప్టికల్ జూమ్, 30x వరకు సూపర్ రిజల్యూషన్ జూమ్ మరియు 'సింగిల్ టేక్' అనే కొత్త షూటింగ్ మోడ్ వంటివి ఉన్నాయి. ఇది ఒక చిన్న వీడియోను అన్ని సెన్సార్ల నుండి ఫోటోతో పాటు వివిధ కోణాల కోసం సంగ్రహిస్తుంది. ముందువైపు గల సెల్ఫీ కెమెరా విషయంలో ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 10 మెగాపిక్సెల్ సెన్సార్ ను కలిగి ఉంటుంది.

గెలాక్సీ S20+ స్పెసిఫికేషన్స్

గెలాక్సీ S20+ స్పెసిఫికేషన్స్

గెలాక్సీ S20+ యొక్క స్పెసిఫికేషన్స్ గెలాక్సీ S20 కి చాలా దగ్గర పోలికాను కలిగి ఉంటుంది. అయితే డిస్ప్లే యొక్క పరిమాణం, బ్యాటరీ సామర్థ్యం విషయంలో మరియు వెనుక కెమెరాలలో స్వల్పంగా మార్పులను కలిగి ఉంటుంది. గెలాక్సీ S20+ 161.9x73.7x7.8mm కొలతలతో 186 గ్రాముల (5G వేరియంట్‌ 188 గ్రాముల) బరువును కలిగి ఉంటుంది. ఇది 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది LTE వెర్షన్‌కు 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ తో వస్తుండగా అలాగే 5G వేరియంట్‌కు 12 జిబి ర్యామ్ మరియు 128 జిబి, 256 జిబి, మరియు 512 జిబి స్టోరేజ్ ఎంపికతో లభిస్తుంది. ముందు మరియు వెనుక కెమెరా కాన్ఫిగరేషన్‌లలో వెనుకవైపు అదనంగా డెప్త్ కెమెరాను చేర్చడం విశేషం. డిస్ప్లే పరంగా ఇది 6.7-అంగుళాల QHD (1,440x3,200 పిక్సెల్స్) డైనమిక్ అమోలేడ్ 2X డిస్‌ప్లేను అందిస్తుంది.

 

 

paytm లో ఇకపై నెలవారి బిల్లులు చెల్లించవచ్చుpaytm లో ఇకపై నెలవారి బిల్లులు చెల్లించవచ్చు

 

కెమెరా సెన్సార్లు

కెమెరా సెన్సార్లు

గెలాక్సీ S20+ ఫోన్ 166.9x76x8.8mm కొలతలు మరియు 220 గ్రాముల బరువుతో (5 జి వేరియంట్‌కు 222 గ్రాములు) వస్తుంది. కొన్ని కెమెరా సెన్సార్లు ఇతర రెండు మోడళ్ల కంటే కూడా కొంచెం అధికంగా అప్‌గ్రేడ్ చేయబడి ఉన్నాయి. వైడ్-యాంగిల్ మరియు డెప్త్ కెమెరాలతో పాటు మెయిన్ కెమెరా కూడా ఎఫ్ / 1.8 ఎపర్చరుతో 108 మెగాపిక్సెల్ సెన్సార్ ను కలిగి ఉంటుంది. అలాగే ఎఫ్ / 3.5 ఎపర్చరుతో 48 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో పాటుగా గెలాక్సీ S20+లో సరికొత్త పెరిస్కోప్ తరహా టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. ఇది 10x హైబ్రిడ్ ఆప్టికల్ జూమ్ మరియు 100x వరకు ‘సూపర్ రిజల్యూషన్ జూమ్' సాధించడానికి అనుమతిస్తుంది. ముందు కెమెరా కూడా 25 మెగాపిక్సెల్ సెన్సార్, ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో ఉంటుంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy S20, S20+ Launched: Price, Specifications and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X