Home
Mobile

Samsung Galaxy S20 5G: శామ్‌సంగ్ 5G ఫోన్‌లు... ధర కాస్త ఎక్కువే...

ఇండియాలో రెండు సంవత్సరాల క్రితం మొదటి స్థానంలో ఉన్న శామ్‌సంగ్ కంపెనీ ఇప్పుడు మళ్ళి తన స్థానాన్ని పొందడానికి చాలా లీక్‌లు మరియు పుకార్ల తరువాత 2020లో మొదటిసారిగా శామ్‌సంగ్ తన S-సిరీస్ గెలాక్సీ S20, గెలాక్సీ S20+ మరియు గెలాక్సీ S20 అల్ట్రా ఫ్లాగ్‌షిప్‌లను అధికారికంగా ఆవిష్కరించింది.

శామ్‌సంగ్

శామ్‌సంగ్ కంపెనీ యొక్క మూడు ఫోన్‌లు సరికొత్త 120HZ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేలు, 5G సపోర్ట్, 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో మెరుగైన కెమెరాలు, పెద్ద బ్యాటరీ మరియు సన్నని బెజెల్స్‌తో అప్‌డేట్ చేసిన డిజైన్ ను కలిగి ఉన్నాయి. గెలాక్సీ S20 మరియు S20+ రెండు కూడా గెలాక్సీ S10 మరియు గెలాక్సీ S10+ లకు అప్ డేట్ వెర్షన్ గా మార్కెట్ లోకి అడుగుపెడుతోంది. అయితే గెలాక్సీ S20 అల్ట్రా అనేది 108 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 40 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మరియు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

 

 

ధరల వివరాలు

ధరల వివరాలు

శామ్‌సంగ్ సంస్థ లాంచ్ చేసిన మూడు ఫోన్‌లలో గెలాక్సీ S20 అల్ట్రాలో 6.9 అంగుళాల అతిపెద్ద డిస్ప్లే ను కలిగి ఉండడమే కాకుండా గరిష్ట మొత్తంలో 16GB ర్యామ్ ను కలిగి ఉంటుంది. దీని యొక్క ధర కూడా కాస్త ఖరీదైనదిగా ఉంది. గెలాక్సీ S20 అల్ట్రా ఫోన్ $1,399 వద్ద ప్రారంభమవుతుండగా గెలాక్సీ S20+ యొక్క ధర $1,199 ప్రారంభ ధర వద్ద లభిస్తుంది. జాబితాలో అత్యంత సరసమైనది గెలాక్సీ S20 స్మార్ట్ ఫోన్ $999 ధర వద్ద ప్రారంభమవుతుంది.శామ్‌సంగ్ గెలాక్సీ S20 సిరీస్ మార్చి 6 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి లభిస్తుందని కంపెనీ తెలిపింది.

 

 

గెలాక్సీ బడ్స్

గెలాక్సీ బడ్స్

శామ్సంగ్ ఇదే ఈవెంట్ లో గెలాక్సీ బడ్స్ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను కూడా విడుదల చేసింది. ఇందులో మెరుగైన సౌండ్ కోసం రెండు మార్గాలలో గల స్పీకర్లు ఉన్నాయి. అలాగే వాయిస్ స్పష్టత కోసం మూడు మైక్రోఫోన్లను కలిగి ఉంది. ఇది ఒక ఛార్జీపై 11 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. ఇది iOS అన్ని పరికరాలతో పనిచేయడానికి వీలు కల్పిస్తుంది.

 

 

గెలాక్సీ S20 అల్ట్రా స్పెసిఫికేషన్స్

గెలాక్సీ S20 అల్ట్రా స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ కొత్త సిరీస్‌లోని అతిపెద్ద ఫోన్‌ అయిన గెలాక్సీ S20 అల్ట్రా యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6.9-అంగుళాల క్యూహెచ్‌డి డైనమిక్ అమోలేడ్ 2X డిస్‌ప్లేను 511pp పిక్సెల్ కౌంట్‌తో కలిగి ఉంటుంది. గెలాక్సీ S20 అల్ట్రా 12GB లేదా 16GB LPDDR5 ర్యామ్‌తో వస్తుంది. అయితే LTE మరియు 5G వేరియంట్‌ల కోసం 128 జిబి , 256 జిబి మరియు 512 జిబి స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం కూడా 5,000 ఎంఏహెచ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. గెలాక్సీ S20 అల్ట్రా అడాప్టర్ 45W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది.

కెమెరా

కెమెరా

గెలాక్సీ S20 అల్ట్రా ఫోన్ 166.9x76x8.8mm కొలతలు మరియు 220 గ్రాముల బరువుతో (5 జి వేరియంట్‌కు 222 గ్రాములు) వస్తుంది. కొన్ని కెమెరా సెన్సార్లు ఇతర రెండు మోడళ్ల కంటే కూడా కొంచెం అధికంగా అప్‌గ్రేడ్ చేయబడి ఉన్నాయి. వైడ్-యాంగిల్ మరియు డెప్త్ కెమెరాలతో పాటు మెయిన్ కెమెరా కూడా ఎఫ్ / 1.8 ఎపర్చరుతో 108 మెగాపిక్సెల్ సెన్సార్ ను కలిగి ఉంటుంది. అలాగే ఎఫ్ / 3.5 ఎపర్చరుతో 48 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో పాటుగా గెలాక్సీ S20 అల్ట్రాలో సరికొత్త పెరిస్కోప్ తరహా టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. ఇది 10x హైబ్రిడ్ ఆప్టికల్ జూమ్ మరియు 100x వరకు ‘సూపర్ రిజల్యూషన్ జూమ్' సాధించడానికి అనుమతిస్తుంది. ముందు కెమెరా కూడా 40 మెగాపిక్సెల్ సెన్సార్, ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో ఉంటుంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy S20 Ultra Launched: Price, Specs and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X