Home
Mobile

శాంసంగ్‌ ప్రీమియం ఫోన్‌ కొనుగోలు చేసేందుకు ఎదురుచూస్తున్నారా.. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ మీకోసమే..!

ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం బ్లాక్ ఫ్రైడే సేల్‌ నిర్వహిస్తోంది. ఈ సేల్‌ అక్టోబర్‌ 24 వ తేదీన ప్రారంభం అయింది. ఈ నెల 29 వరకు అందుబాటులోకి ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌లను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ పేజీ ఆధారంగా ఈ బ్లాక్‌ ఫ్రైడ్‌ సేల్‌లో భాగంగా యాక్సెస్‌ బ్యాంక్‌, HDFC, IDFC ఫస్ట్ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్ బరోడా కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సె్స్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డుతో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ 2024 లో భాగంగా శాంసంగ్‌ గెలాక్సీ S23 5G స్మార్ట్‌ఫోన్‌ను (Samsung Galaxy S23 5G Smartphone) విడుదల ధరతో పోలిస్తే భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో 256GB వేరియంట్‌పై తగ్గింపును పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా 8GB ర్యామ్, 256GB సోరేజీ వేరియంట్‌ను రూ.43,999 ధరకే సొంతం చేసుకోవచ్చు.

Samsung galaxy S23 5G Smartphone

దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను (Flipkart Black Friday Sale 2024) పొందవచ్చు. ఈ సంవత్సరం జనవరిలో ఈ హ్యాండ్‌సెట్‌ భారత్‌ మార్కెట్‌లో విడుదల అయింది. ప్రస్తుతం 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. క్రీమ్‌, గ్రీన్, లావెండర్‌, ఫాంటమ్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.

శాంసంగ్‌ గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
శాంసంగ్‌ గెలాక్సీ S23 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.1 అంగుళాల FHD+ డైనమిక్‌ అమోలెడ్‌ 2x డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2340*1080 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 1750 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+ ను సపోర్టు చేస్తుంది. మరియు గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 తో రక్షణ ను కలిగి ఉంది.

శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత OneUI 5.1 OS తో పనిచేస్తుంది. మరియు క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ 8GB ర్యామ్ మరియు గరిష్ఠంగా 512GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. రెండు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ S23 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్‌ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరాలతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 12MP కెమెరాను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో మెరుగైన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌ 25W ఛార్జింగ్‌ సపోర్టుతో 3900mAh బ్యాటరీని కలిగి ఉంది. 10W వైర్‌లెస్‌ సపోర్టును కూడా సపోర్టు చేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, USB-C, బ్లూటూత్‌ 5.3, వైఫై 802.11 వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. బారోమీటర్‌, యాక్సెలిరోమీటర్‌, గైరోస్కోప్‌, జియో మాగ్నటిక్‌ సెన్సార్‌, లైట్‌ సెన్సార్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung galaxy S23 5G Smartphone gets best deal on flipkart black friday sale november 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X