Home
Mobile

ధర రూ.74,999 కు విడుదలైన శాంసంగ్ ఫోన్‌పై రూ.32 వేలకు పైగా తగ్గింపు.. పూర్తి వివరాలు..!

శాంసంగ్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ ను కొనుగోలు చేయాలని భావిస్తుంటే ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ లో బెస్ట్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది. శాంసంగ్‌ గెలాక్సీ S23 హ్యాండ్‌సెట్‌ను (Samsung Galaxy S23 5G Smartphone) ప్రస్తుతం అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ‌బ్యాంకు కార్డుల ద్వారా మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ శాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరా, IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

శాంసంగ్ గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో భారత్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.74,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) రూ.42,999 కే సొంతం చేసుకోవచ్చు.

Samsung galaxy S23 5G smartphone

నాలుగు కలర్ వేరియంట్‌లు :
అదే 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.47,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. క్రీమ్‌, గ్రీన్‌, లావెండర్‌, ఫాంటమ్‌ బ్లాక్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌ల వివరాలు :
గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌ 6.1 అంగుళాల FHD+ (2340*1080 పిక్సల్స్‌) డైనమిక్‌ అమోలెడ్‌ 2x డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 120Hz గరిష్ఠ రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. విజన్‌ బూస్టర్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌గా ఉంది.

చిప్‌సెట్‌, OS వివరాలు : శాసంగ్‌ గెలాక్సీ S23 హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత OneUI 5.1 OS ను కలిగి ఉంటుంది. మరియు క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు : ఈ ఫోన్‌ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. సర్కిల్‌ టు సెర్చ్‌, లైవ్‌ ట్రాన్స్‌లేట్‌, ఫోటో అసిస్ట్‌ వంటి అనేక AI ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ 25W ఛార్జింగ్‌ సపోర్టుతో 3900mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 10W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది.

50MP ప్రైమరీ కెమెరా : కెమెరా విభాగం పరంగా ఈ శాంసంగ్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను అమర్చారు. 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 10MP టెలిఫోటో లెన్స్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 12MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

కనెక్టివిటీ పరంగా గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌ 5G, 4G LTE, WiFi 802.11, బ్లూటూత్‌ 5.3, USB-C వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు బారోమీటర్‌, యాక్సెలిరోమీటర్‌, గైరో సెన్సార్‌, జియోమాగ్నటిక్‌ సెన్సార్‌, లైట్‌ సెన్సార్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌లు ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung galaxy S23 5G smartphone gets massive discount on flipkart january 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X