Home
Mobile

8K వీడియో రికార్డింగ్ తో వచ్చే ఈ Samsung ఫోన్, ఇప్పుడు సగం ధరకే కొనండి! సేల్ ఆఫర్ వివరాలు

ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ ఒకదాని తర్వాత మరొకటి ఆఫర్ల ద్వారా వినియోగదారులను ఆకర్షించింది మరియు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహించి గొప్ప ఆఫర్‌లను ప్రకటించింది. అందులో ప్రధానంగా ఎంపిక చేసిన మొబైల్స్ కు బొంబాట్ డిస్కౌంట్లను అందుబాటులోకి తెచ్చింది. వాటిలో, శాంసంగ్ సంస్థ యొక్క Samsung Galaxy S23 మొబైల్‌ను భారీ తగ్గింపు ధరతో అందుబాటులో ఉంచింది.

అవును, Samsung Galaxy S23 ఫోన్ Flipkart సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ఫెస్టివల్ సేల్‌లో భారీ ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది.అసలు లాంచ్ ధర రూ.89,999 నుండి 55% వరకు డైరెక్ట్ డిస్కౌంట్ అందిస్తోంది.

Samsung Galaxy S23 Now Available With Huge Discount Offer In Flipkart  Sale Price  Offers Details

ఈ మొబైల్ యొక్క 8 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్లో భాగంగా రూ. 39,999. ధర వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంది. అదనంగా, కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల నుండి కూడా డిస్కౌంట్లను పొందవచ్చు.

ఈ శాంసంగ్ గెలాక్సీ S23 ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ప్రైమరీ కెమెరా 50-మెగాపిక్సెల్ సెన్సార్. అలాగే, ఇది క్రీమ్, గ్రీన్, లావెండర్ మరియు ఫాంటమ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లను కలిగి ఉంది మరియు 3,900mAh కెపాసిటీ బ్యాటరీ బ్యాకప్ సపోర్ట్‌ను కూడా పొందింది. కాబట్టి శాంసంగ్ గెలాక్సీ S23 ఫోన్‌ యొక్క ఇతర ఫీచర్ల గురించి మరింత తెలుసుకుందాం.

Samsung Galaxy S23 - ఫీచర్ల వివరాలు
శాంసంగ్ గెలాక్సీ S23 ఫోన్‌ 6.1-అంగుళాల ఫుల్ HD ప్లస్ డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే, ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది, దీనిని 48Hzకి తగ్గించవచ్చు. డిస్ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణను కూడా పొందుతుంది.

శాంసంగ్ గెలాక్సీ S23 ఫోన్‌ ఆండ్రాయిడ్ 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్ ద్వారా ఆధారితమైన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే ఈ ఫోన్ 8GB RAM మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ S23 ఫోన్‌ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ప్రైమరీ కెమెరా 50-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. రెండవ కెమెరా 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్‌ను కలిగి ఉంది మరియు మూడవ కెమెరా 10-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది.

ఇందులో 12 మెగాపిక్సెల్ సెన్సార్‌తో కూడిన సెల్ఫీ కెమెరా కూడా ఉంది. అలాగే, ఈ మొబైల్ అప్‌గ్రేడ్ చేసిన కెమెరా అప్లికేషన్‌ను పొందింది, దీని ద్వారా సెకనుకు 30 ఫ్రేమ్‌ల వద్ద 8K వీడియో రికార్డింగ్ చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S23 ఫోన్‌ 3,900mAh బ్యాటరీతో 25W వైర్డు ఛార్జింగ్ మరియు 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కేవలం 30 నిమిషాల్లో బ్యాటరీని 50% వరకు ఛార్జ్ చేయవచ్చని శాంసంగ్ కంపెనీ పేర్కొంది. ఇతర కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, Wi-Fi డైరెక్ట్ మరియు USB టైప్-C పోర్ట్‌కి మద్దతు ఉన్నాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియా ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S23 Now Available With Huge Discount Offer In Flipkart. Sale Price, Offers Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X