Home
Mobile

రూ.74,999 ఫోన్ ఇప్పుడు కేవలం రూ.38,000.. 50MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2తో సొంతం చేసుకోండి..

Samsung Galaxy S23: శామ్‌సంగ్ గెలాక్సీ S23 ఫోన్ కొనాలనుకునేవాళ్లకి శుభవార్త. ఎందుకంటే, ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో ఒక్కసారిగా భారీగా తగ్గింది. ఇంతకుముందు ఇండియాలో రూ.74,999 పెట్టి కొన్న ఈ ఫోన్, ఇప్పుడు కేవలం రూ.39,999కే లభిస్తోంది. ఒకవేళ మీ దగ్గర ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే, అదనంగా మరో రూ.2,000 తగ్గింపు కూడా పొందొచ్చు. అంటే, ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవడానికి మీరు పెట్టేది జస్ట్ రూ.37,999 మాత్రమే.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాప్-క్లాస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఇది చాలా తక్కువ ధరకే వస్తోంది. అయితే, ఇలాంటి ఆఫర్లు ఎప్పుడూ ఉండవు. ధర మళ్లీ పెరిగేలోపే వెంటనే కొనేయడం తెలివైన పని. దానికంటే ముందు ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు ఏవో తెలుసుకుందాం.

Samsung Galaxy S23 Sees Huge Price Drop  Now Available for Just Rs 38K

* చిన్న సైజులో స్టైలిష్ డిజైన్..

శామ్‌సంగ్ గెలాక్సీ S23 ఫోన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, పట్టుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. చిన్నగా ఉన్నా, లుక్ మాత్రం అదిరిపోతుంది. దీంట్లో 6.1-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. అది కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అంటే, స్క్రీన్ చాలా స్మూత్‌గా ఉంటుంది, వీడియోలు చూసినా, గేమ్‌లు ఆడినా మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది.

* పర్ఫార్మెన్స్ అదిరింది..

శామ్‌సంగ్ గెలాక్సీ S23 ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉంది. దీంతో పర్‌ఫార్మెన్స్ మాత్రం చాలా వేగవంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గేమ్స్ ఆడవచ్చు, ఒకేసారి చాలా యాప్స్ వాడవచ్చు, ఎంత కష్టమైన పనులు చేసినా ఫోన్ మాత్రం హ్యాంగ్ అవ్వదు. ఇంకా 8GB RAM, 128GB స్టోరేజ్ కూడా ఉన్నాయి.

యాప్స్, ఫొటోలు, వీడియోలు అన్నీ నిశ్చింతగా దాచుకోవచ్చు. శామ్‌సంగ్ సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ వల్ల ఫోన్ ఎప్పుడూ ఫాస్ట్‌గా, రెస్పాన్సివ్‌గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఫోన్‌కి IP68 రేటింగ్ ఉంది. అంటే, దుమ్ము, నీళ్లు ఈ మొబైల్‌ను ఏమీ చేయలేవు.

* కెమెరా క్వాలిటీ బాగుంటుంది

శామ్‌సంగ్ గెలాక్సీ S23 కెమెరా గురించి ఎంత చెప్పినా తక్కువే. లైటింగ్ ఎలా ఉన్నా సరే, ఫొటోలు మాత్రం చాలా బాగా వస్తాయి. వెనుకవైపు 50MP మెయిన్ కెమెరా, జూమ్ కోసం 10MP టెలిఫొటో లెన్స్, ఇంకా వైడ్ యాంగిల్ షాట్స్ కోసం 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి.

సెల్ఫీల కోసం ముందువైపు 12MP కెమెరా ఇచ్చారు. పగలు అయినా, రాత్రి అయినా, ఫొటోలు మాత్రం షార్ప్‌గా, కలర్‌ఫుల్‌గా వస్తాయి. వీడియో కాల్స్ కూడా చాలా క్లారిటీగా మాట్లాడొచ్చు. శామ్‌సంగ్ గెలాక్సీ S23లో 3,900mAh బ్యాటరీ ఉంది. నార్మల్‌గా వాడితే రోజంతా వస్తుంది. అంతేకాదు, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

* సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, లాంగ్ టర్మ్ వాల్యూ..

శామ్‌సంగ్ సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్, బ్యాటరీ ఎఫిషియెన్సీ వల్ల రోజంతా ఫోన్ పర్‌ఫార్మెన్స్ అదిరిపోతుంది. శామ్‌సంగ్ కంపెనీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ విషయంలో ఎప్పుడూ ముందుంటుంది. శామ్‌సంగ్ గెలాక్సీ S23కి రెగ్యులర్‌గా అప్‌డేట్స్ వస్తాయి. దీంతో మీ ఫోన్ ఎప్పుడూ సేఫ్‌గా, కొత్త ఫీచర్స్‌తో ఉంటుంది.

గొప్ప స్పెసిఫికేషన్స్, స్టైలిష్ డిజైన్, లాంగ్ టర్మ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఉండటం వల్ల, 2025లో కూడా ఈ ఫోన్ మంచి ఎంపిక అవుతుంది. ఇప్పుడున్న ధరలో చూస్తే, కొత్తగా వస్తున్న ఫ్లాగ్‌షిప్ ఫోన్ల కంటే ఇది చాలా మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్పొచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S23 price dramatically drops to Rs 38K on Flipkart. Flagship Snapdragon 8 Gen 2, vibrant display, and camera at amazing value. Limited offer.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X