Home
Mobile

ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్‌.. శాంసంగ్‌ గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఫీచర్‌లు, ధర వివరాలు

శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ లకు భారత్‌ మార్కెట్‌ లో భారీ డిమాండ్ ఉంది. ఎంట్రీ లెవల్‌ ఫోన్‌ ల నుంచి ఫ్లాగ్‌షిప్‌ వరకు భారీగా విక్రయాలు జరుగుతుంటాయి. తాజాగా శాంసంగ్‌ ప్రీమియం ఫోన్‌ ప్రస్తుతం భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బచత్‌ సేల్‌ లో (Flipkart Bachat Days sale 2024) భాగంగా శాంసంగ్‌ గెలాక్సీ S23 హ్యాండ్‌సెట్‌ ను (Samsung Galaxy S23 Smartphone Sale) భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ గత సంవత్సరం ఫిబ్రవరిలో విడుదల అయింది. ఇటీవలే శాంసంగ్ గెలాక్సీ S24 హ్యాండ్‌సెట్‌ లాంచ్ అయింది.

గతం, ఇప్పటి ధరలు ఎలా ఉన్నాయి ? :
ప్రస్తుతం ప్రీమియం ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ఎదురుచూస్తుంటే ఈ శాంసంగ్ గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌ అత్యత్తమ సెలక్షన్ కానుంది. విడుదల సమయంలో ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.74,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.44999 గా ఉంది. సుమారు రూ.30000 తగ్గింపును పొందింది.

Samsung Galaxy S23 Smartphone

రూ.2250 అదనపు డిస్కౌంట్ ! :
శాంసంగ్‌ గెలాక్సీ S23 హ్యాండ్‌సెట్‌ ను ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం తగ్గింపును పొందవచ్చు. అంటే సుమారు రూ.2250 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో లభిస్తుంది. క్రీమ్‌, గ్రీన్‌, లావెండర్‌, ఫాంటమ్‌ బ్లాక్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌ (Samsung Galaxy S23 Smartphone Specifications) 6.1 అంగుళాల FHD+ డైనమిక్‌ అమోలెడ్‌ 2x డిస్‌ప్లేను కలిగి ఉంది. 2340*1080 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 120Hz గరిష్ఠ రీఫ్రెష్‌ రేట్‌తో అందుబాటులో ఉంది. విజన్‌ బూస్టర్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది.

Samsung Galaxy S23 Smartphone

ఈ హ్యాండ్‌సెట్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత OneUI 5.1 OS తో పనిచేస్తుంది. ఈ గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌ 25W ఛార్జింగ్‌ సపోర్టుతో 3900mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 10W వైర్‌లెస్‌ సపోర్టును కూడా సపోర్టు చేస్తుంది.

ట్రిపుల్‌ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్‌ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందు వైపు 12MP కెమెరాను కలిగి ఉంది. ప్రైమరీ కెమెరా అనేక కెమెరా మోడ్స్‌ ను సపోర్టు చేస్తుంది.

శాంసంగ్‌ గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, USB-C, బ్లూటూత్‌ 5.3, వైఫై 802.11 వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. యాక్సెలిరోమీటర్‌, బారోమీటర్‌, గైరో సెన్సార్‌, జియోమాగ్నటిక్‌ సెన్సార్‌, లైట్‌ సెన్సార్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌లు ఉన్నాయి. IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X