ఈ Samsung టాప్ మోడల్ ఫోన్ పై రూ.53000 భారీ డిస్కౌంట్! ఆఫర్ ధర వివరాలు
శాంసంగ్ తన తాజా Samsung Galaxy S24 సిరీస్‌ని జనవరిలో లాంచ్ చేసింది. ఇప్పుడు మీ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి ఇది సరైన సమయం కావచ్చు. ఎందుకంటే శాంసంగ్ కొత్త S24 సిరీస్ లాంచ్ తర్వాత దాని ముందు మోడల్ Samsung Galaxy S23 Ultra పై ఇప్పుడు ధర తగ్గింది.
అందుకే, మీరు లేటెస్ట్ సిరీస్ ను కొనుగోలు చేయడానికి బడ్జెట్ సమస్య ఉంటే, దానికి బదులుగా మీరు దాని ముందున్న Samsung Galaxy S23 Ultra ని కొనుగోలు చేయవచ్చు. ఇది లాంచ్ అయినప్పుడు చాలా సానుకూల రివ్యూలను పొందింది మరియు నేటికీ ఇది స్మార్ట్‌ఫోన్‌ల పరంగా ముఖ్యంగా దాని కెమెరా పనితీరు పై అద్భుతమైనదిగా ఉంది.

ఇప్పుడు, శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ధర లక్ష లోపు అందుబాటులో ఉంది. కాబట్టి, మీరు ప్రీమియం విభాగంలో మంచి స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, అది నిజంగా మంచి ఎంపిక అవుతుంది.ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో 36 శాతం గణనీయమైన తగ్గింపుతో, ప్రీమియం డిజైన్ మరియు ఆకట్టుకునే కెమెరా సామర్థ్యాలతో శక్తివంతమైన పరికరం కావాలనుకునే వారికి ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది.
ఈ శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఆఫర్ డీల్ గురించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఆఫర్ ధర వివరాలు
అమెజాన్‌లోని ధరల సమాచారం ప్రకారం, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా పై 36 శాతం గణనీయమైన ఫ్లాట్ తగ్గింపు ఆఫర్ ను అందిస్తోంది. ఇది 256GB స్టోరేజ్ వేరియంట్ ధరను కేవలం రూ. 95,798కి తగ్గించింది, లాంచ్ సమయంలో దీని ప్రారంభ ధర రూ. 1,24,990 గా ఉండేది. అంటే,దాదాపు రూ.30000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
అలాగే, 512GB స్టోరేజ్ ఆప్షన్ విషయానికొస్తే, మీరు అమెజాన్ నుండి దాని లాంచ్ ధర రూ. 1,61,999 తో పోలిస్తే ప్రస్తుతం సేల్ లో మీరు ధర రూ. 1,08,799 కు కొనుగోలు చేయవచ్చు. అంటే, దీనిపై మీకు దాదాపు రూ. 53,200 తగ్గింపు లభిస్తుంది.
Samsung Galaxy S23 అల్ట్రా స్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో భారీ 6.8-అంగుళాల WQHD+ సూపర్ అమోలెడ్ ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ 'గెలాక్సీ కోసం క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 మొబైల్ ప్లాట్‌ఫారమ్,' ఇది అనుకూలీకరించిన స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 SoC కోసం శాంసంగ్ బ్రాండింగ్. ఈ పరికరం గరిష్టంగా 12GB RAM మరియు గరిష్టంగా 1TB స్టోరేజీతో వస్తుంది.
ఇది మెయిన్ కెమెరా 200-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది.ఈ సెన్సార్ 1/1.3-అంగుళాల పరిమాణాన్ని కలిగి ఉంది.10-మెగాపిక్సెల్ OISతో రెండు టెలిఫోటో లెన్స్‌లను కలిగి ఉంది, అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్ 12-మెగాపిక్సెల్ (f/2.2). ఇది 24/30 fps ఫ్రేమ్ రేటుతో గరిష్టంగా 8K నాణ్యత గల వీడియోలను రికార్డ్ చేయగలదు.
ఇక వీడియో కాలింగ్ మరియు సెల్ఫీల కోసం, సెల్ఫీ కెమెరా 12-మెగాపిక్సెల్ (f/2.2). ఫ్రంట్ కెమెరా 30/60 fps ఫ్రేమ్ రేటుతో గరిష్టంగా 4K నాణ్యతతో వీడియోలను రికార్డ్ చేయగలదు.
ఇక మనము బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లైతే, ఇది శక్తివంతమైన 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 45W వద్ద ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. శాంసంగ్ సమాచారం ప్రకారం, కేవలం 30 నిమిషాల్లో ఛార్జ్ 0 శాతం నుండి 65 శాతానికి ఛార్జ్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








