Samsung నుంచి రాబోయే ఫ్లాగ్‌షిప్‌లో షాకిచ్చేలా 200MP కెమెరా సెట‌ప్‌!

|

Samsung Galaxy S22 Ultra యొక్క స‌క్సెస‌ర్‌గా పేర్కొంటున్న రాబోయే Galaxy S23 Ultra స్మార్ట్‌ఫోన్ 200-మెగాపిక్సెల్ కెమెరాతో వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు ఓ నివేదిక ఆ మొబైల్‌కు సంబంధించిన కెమెరా స్పెసిఫికేష‌న్ల వివ‌రాల‌ను పేర్కొంది. Samsung కంపెనీ ఈ సంవత్సరం ప్రారంభంలో గెలాక్సీ S22 సిరీస్‌ను ఆవిష్కరించిన విష‌యం తెలిసిందే.. కాగా, వచ్చే ఏడాదిలో గెలాక్సీ S23 లైనప్‌ను పరిచయం చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంతా భావిస్తున్న‌ట్లు నివేదిక వెల్ల‌డించింది.

 
Samsung నుంచి రాబోయే ఫ్లాగ్‌షిప్‌లో షాకిచ్చేలా 200MP కెమెరా సెట‌ప్‌!

Galaxy S23 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ Qualcomm యొక్క 3D Sonic Max ఫింగర్‌ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీని కూడా ఉపయోగించగలదని ఒక టిప్‌స్టర్ పేర్కొన్నారు. మ‌రోవైపు, కంపెనీ మాత్రం రాబోయే ఫ్లాగ్‌షిప్ Galaxy S22 Ultra హ్యాండ్‌సెట్‌కు గురించి అధికారికంగా ఇంకా ఎటువంటి వివరాలను ప్రకటించలేదు.

కొరియాకు చెందిన‌ IT న్యూస్ యొక్క నివేదిక ప్రకారం, Samsung Galaxy S23 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకదానిలో 200-మెగాపిక్సెల్ కెమెరాను ఫీచర్ చేయడానికి కంపెనీ యోచిస్తోంది. Galaxy S23 Ultra ఈ సిరీస్‌లో సెన్సార్‌తో అమర్చబడిన ఏకైక హ్యాండ్‌సెట్ కావచ్చు. Samsung మొబైల్ ఎక్స్‌పీరియన్స్ (MX) విభాగం ఈ సమాచారాన్ని కంపెనీ యొక్క ప్రధాన కెమెరా భాగస్వాములకు తెలియజేసిందని నివేదిక పేర్కొంది.

Samsung నుంచి రాబోయే ఫ్లాగ్‌షిప్‌లో షాకిచ్చేలా 200MP కెమెరా సెట‌ప్‌!

Samsung దాని కొత్త సిరీస్‌ అభివృద్ధి మరియు ఉత్పత్తి ప్రణాళికలను జ‌రుగుతున్న‌ట్లు చెప్పబడింది, నివేదిక ప్రకారం, దాని 200-మెగాపిక్సెల్ సెన్సార్ కోసం భాగాలను అభివృద్ధి చేయడానికి కొన్ని సంస్థలను నియమించినట్లు పేర్కొంది. ప్రస్తుతం Samsung Electro-Mechanics మరియు Samsung Electronics మాత్రమే 200-megapixel కెమెరాలను ఉత్పత్తి చేస్తున్నాయని నివేదిక పేర్కొంది. Samsung చివ‌రిగా కెమెరా అప్‌గ్రేడ్‌ను Galaxy S20 Ultraలో 108-మెగాపిక్సెల్ సెన్సార్‌ను పరిచయం చేసింది. ఆ త‌ర్వాత‌ Galaxy S21 అల్ట్రా మరియు Galaxy S22 అల్ట్రా కూడా 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కొన‌సాగింపు చేశాయి.

ISOCELL కెమెరాలు:
స్పష్టంగా చెప్పాలంటే, ISOCELL HP2 అనేది ISOCELL HP1 మరియు ISOCELL HP3 రెండింటి కంటే మెరుగైన పనితీరును ప్రదర్శిస్తుంది. అవును, కొన్నిసార్లు మేము కూడా Samsung కంపెనీ ఉత్పత్తులకు పేరు పెట్టే విధానాన్ని అర్థం చేసుకోలేము. ఉదాహరణకు, ISOCELL GN2 అనేది ISOCELL GN1 కంటే మెరుగైన సెన్సర్, కానీ ISOCELL GN5 ఆ రెండింటిలోనూ అంత మంచిది కాదు.

Samsung నుంచి రాబోయే ఫ్లాగ్‌షిప్‌లో షాకిచ్చేలా 200MP కెమెరా సెట‌ప్‌!

8K వీడియో రికార్డింగ్‌:
ఈ కొత్త మొబైల్‌లో ఉప‌యోగిస్తున్న సెన్సార్ సహాయం తో 8K వీడియోలను సులువుగా రికార్డ్ చేయగలదు. తక్కువ దూరాల్లో కూడా ఇది సాధ్యమవుతుంది. అంతే కాకుండా, Samsung యొక్క ఈ సెన్సార్లను ప్రపంచంలోని అనేక స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఉపయోగించవచ్చని చెప్పబడింది. స్మార్ట్‌ఫోన్ కెమెరాల తయారీలో శాంసంగ్ చాలా ముందుంది.శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ సెన్సార్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్యున్ చాంగ్ ఇటీవలే శామ్సంగ్ హై-రిజల్యూషన్ ఇమేజ్ సెన్సార్‌లను తదుపరి స్థాయికి తీసుకెళ్లే అల్ట్రాఫైన్ పిక్సెల్ టెక్నాలజీలను ప్రారంభించాలని యోచిస్తోందని పేర్కొన్నారు. ISOCELL HP1 సెన్సార్ మరియు ఇప్పటికే ఉన్న లోపాలను అధిగమించే అల్ట్రాఫాస్ట్ ఆటోఫోకస్ సెన్సార్‌ని ఉపయోగించడం ద్వారా కంపెనీ తదుపరి తరం అనుభవాన్ని అందించడంలో ఆశ్చర్యం లేదు.

 

ఇదిలా ఉండగా, Galaxy S23 Ultra కోసం Samsung Qualcomm యొక్క 3D Sonic Max ఫింగర్‌ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీని ఉపయోగించుకునే అవకాశం ఉందని టిప్‌స్టర్ ఆల్విన్ (@sondesix) ఇటీవల ట్వీట్ చేశారు. ఈ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ Vivo X80 Pro మరియు iQoo 9 Proలో ఫీచర్ చేయబడుతుందని చెప్పబడింది. ఈ సెన్సార్ లార్జ్ స్కానింగ్ ఫీచ‌ర్‌ మరియు వేగవంతమైన స్కానింగ్ ఫీచ‌ర్ కలిగి ఉందని నివేదించబడింది. అంతేకాకుండా, ఇది అన్‌లాక్ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని పేర్కొంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy S23 Ultra Will Reportedly Feature 200-Megapixel Camera, Could Sport Faster Fingerprint Sensor

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X