Home
Mobile

శాంసంగ్‌ గెలాక్సీ S24 5G స్మార్ట్‌ఫోన్‌ కొత్త వేరియంట్ విడుదల... బ్యాంకు కార్డుపై రూ.5000 డిస్కౌంట్‌..!

శాంసంగ్‌ సంస్థ తాజాగా భారత్‌ మార్కెట్‌ లో శాంసంగ్ గెలాక్సీ S24 5G స్మార్ట్‌ ఫోన్‌ (Samsung Galaxy S24 5G Smartphone) కొత్త వేరియంట్‌ ను లాంచ్‌ చేసింది. ఇప్పటికే 8GB ర్యామ్‌ +256GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను విడుదల చేసింది.

శాంసంగ్‌ గెలాక్సీ S24 5G స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 స్మార్ట్‌ ఫోన్‌ 6.2 అంగుళాల పుల్‌ HD+ డైనమిక్‌ అమోలెడ్‌ 2x డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో లాంచ్‌ అయింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.1 OS పైన పనిచేస్తుంది. మరియు Exynos 2400 ప్రాసెసర్ పైన పనిచేస్తుంది.

Samsung Galaxy S24 5G Smartphone 128 ROM variant launched

50MP ప్రైమరీ కెమెరా..
కెమెరా విభాగం విషయానికి వస్తే శాంసంగ్ గెలాక్సీ S24 స్మార్ట్‌ ఫోన్‌ వెనుక వైపు OIS ( ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్ ) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా సహా 10MP, 12MP కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 12MP కెమెరాను కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ S24 స్మార్ట్‌ ఫోన్‌ 25W వైర్‌ మరియు 15W వైర్‌ లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా Wi-Fi 6, బ్లూటూత్‌ 5.3, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌ సెట్‌ అంబర్‌ ఎల్లో, కోబాల్ట్‌ వైలెట్‌, ఒనిక్స్‌ బ్లాక్‌, మార్బు్ల్‌ గ్రే రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

గెలాక్సీ S24 5G కొత్త వేరియంట్ ధర :
శాంసంగ్‌ గెలాక్సీ S24 5G స్మార్ట్‌ ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.74,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ మోడల్‌ ధర రూ.79,999 మరియు 8GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్‌ రూ.89,999 గా ఉంది. శాంసంగ్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

ఈ శాంసంగ్‌ గెలాక్సీ S24 5G కొత్త వేరియంట్‌ ను HDFC క్రెడిట్‌, డెబిట్‌ కార్డు ద్వారా EMI, ఇతర లావాదేవీలపై రూ.5000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.5000 ఎక్స్చేంజీ బోనస్‌ను పొందవచ్చు. శాంసంగ్‌ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S24 5G Smartphone New variant launched in india price and sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X