Home
Mobile

ధర రూ.59,999 కు విడుదలైన శాంసంగ్ ప్రీమియం ఫోన్‌ను రూ.42 వేల ధరకే కొనుగోలు చేయవచ్చు..!

భారత్‌లో ఎంట్రీ లెవల్‌, బడ్జెట్‌ రేంజ్‌ ఫోన్లతోపాటు ప్రీమియం హ్యాండ్‌సెట్‌ లకు కూడా భారీ డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం అనేక స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు ఫ్లాష్‌షిప్‌ హ్యాండ్‌సెట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. శాంసంగ్‌ గెలాక్సీ S24 FE హ్యాండ్‌సెట్‌ ను ప్రస్తుతం డిస్కౌంట్‌ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రీమియం ఫోన్‌ల కోసం ఎదురుచూసే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్‌ గా ఉంటుంది. ఈ ఫోన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 50MP కెమెరా, 7 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది.

ధర వివరాలు :
శాంసంగ్‌ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.65999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో ఈ హ్యాండ్‌సెట్‌ ను భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy S24 FE Smartphone

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో (Flipkart) 128GB వేరియంట్‌ రూ.44,999 గా ఉంది. అదే 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.50,999 గా ఉంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డుల ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. సుమారు రూ.2,100 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.42,899 గా ఉంటుంది. ఈ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌ మూడు రంగుల్లో లభిస్తుంది. మింట్‌, గ్రాఫైట్, బ్లూ కలర్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌ వివరాలు :
గెలాక్సీ S24 FE (Samsung Galaxy S24 FE) హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.7 అంగుళాల FHD+ 2x డైనమిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో లభిస్తోంది. ఈ డిస్‌ప్లే 1900 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది.

7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 6.1 ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 7 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లతోపాటు 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుందని శాంసంగ్‌ వెల్లడించింది. ఈ ఫోన్‌ 4nm డెకా కోర్‌ Exynos 2400e SoC చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది.

ట్రిపుల్‌ కెమెరా :
విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్‌ జూమ్‌తో 8MP టెలీఫోటో లెన్స్‌, 12MP అల్ట్రావైడ్‌ కెమెరాలతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 10MP కెమెరాను కలిగి ఉంది.

గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్ 25W ఛార్జింగ్ సపోర్టుతో 4700mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్‌ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది. సర్కిల్ టు సెర్చ్‌, లైవ్ ట్రాన్సిలేట్‌ సహా మరెన్నో ఫీచర్‌ లు ఉన్నాయి. దీంతోపాటు ఈ ఫోన్‌ మెరుగైన వేపర్‌ ఛాంబర్‌ ను కలిగి ఉంది.

ఈ శాంసంగ్‌ స్మా్ర్ట్‌ఫోన్‌ స్మార్ట్‌ స్విచ్, క్విక్‌ షేర్‌, Knox Vault వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్‌ 5.3, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S24 FE Smartphone gets best deal on flipkart check features and specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X