Home
Mobile

శాంసంగ్‌ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. అమెజాన్‌ సేల్‌ పూర్తి వివరాలు..!

శాంసంగ్‌ నుంచి ఈ సంవత్సరం గెలాక్సీ S25 సిరీస్‌ లాంచ్‌ అయింది. మరియు ఇటీవలే శాంసంగ్‌ గెలాక్సీ S25 ఎడ్జ్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. అయితే గత సంవత్సరం లాంచ్ అయిన శాంసంగ్‌ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌ ను ప్రస్తుతం తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. సుమారుగా రూ.25 వేల డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో ప్రస్తుతం ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది. ప్లాగ్‌షిప్‌ ఫోన్‌ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఈ ఫోన్‌ మంచి ఆప్షన్‌ అయ్యే అవకాశం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy S24 FE Smartphone) విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59,999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.35,145 ధరకు అందుబాటులో ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా గరిష్ఠంగా రూ.1250 వరకు అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Samsung Galaxy S24 FE Smartphone gets best price deal on amazon here are the full details

బ్యాంకు కార్డులపై అదనపు తగ్గింపు :
అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ విడుదల సమయంలో ధర రూ.65999 గా ఉండేది. అమెజాన్‌లో రూ.43,500 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో రూ.1250 అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ గ్రాఫైట్‌, మింట్‌, బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

ఏకంగా 7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
శాంసంగ్‌ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌ 4nm Exynos 2400e చిప్‌సెట్‌ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 6.1 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 7 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుందని శాంసంగ్ తెలిపింది.

ఈ గెలాక్సీ హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల FHD+ డైనమిక్‌ అమోలెడ్‌ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2340 x 1080 పిక్సల్స్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. మరియు 25W ఛార్జింగ్ సపోర్టుతో 4700mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ట్రిపుల్‌ కెమెరా :
కెమెరా విభాగం పరంగా గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్‌ జూమ్‌తో 8MP టెలిఫోటో లెన్స్‌, 12MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాతో అందుబాటులో ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 10MP కెమెరాను అమర్చారు.

ఈ ఫోన్ IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం వేపర్‌ కూలింగ్‌ ఛాంబర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ సర్కిల్‌ టూ సెర్చ్‌, Live Translation వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, WiFi 6E, బ్లూటూత్‌ 5.3, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం Knox Vault ప్రత్యేక ఫీచర్‌తోపాటు క్విక్‌ షేర్‌ నూ కూడా కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy S24 FE Smartphone gets best price deal on amazon here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X