శాంసంగ్ ప్రీమియం ఫోన్‌పై ఏకంగా రూ.15000 డిస్కౌంట్.. ఈ డీల్ మిస్ కావద్దు..!
ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు అనేక మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ధర ఎక్కువగా ఉండడం కారణంగా వెనక్కి తగ్గుతారు. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్‌లో (Flipkart Manumental Sale 2025)భాగంగా శాంసంగ్ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.15000 తగ్గింపును పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరాతోపాటు IP68 రేటింగ్‌తో అందుబాటులో ఉంది. అయితే ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా బ్యాంకు కార్డులతో అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy S24 FE Smartphone) ప్రస్తుతం 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59,999 గా ఉంది. మరియు 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.65,999 గా ఉంది.

రూ.15000 డిస్కౌంట్ :
ప్రస్తుతం ఫ్లి్ప్‌కార్ట్ సేల్‌లో భాగంగా 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.44,999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే సుమారు రూ.15,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. రూ.65,999 విడుదలైన 256GB వేరియంట్‌ను ప్రస్తుతం రూ.50,999 కే సొంతం చేసుకోవచ్చు.
అదనపు డిస్కౌంట్ :
దీంతోపాటు HDFC క్రెడిట్ కార్డుతో 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు ఫ్లి్‌ప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ గెలాక్సీ S24 FE హ్యాండ్‌సెట్ మింట్, గ్రాఫైట్, బ్లూ కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల FHD+ 2x డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. మరియు ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 4nm డెకా కోర్ Exynos 2400e SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.1 ను కలిగి ఉంది.
7 సంవత్సరాలపాటు అప్‌డేట్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 7 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు మరియు 7 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని శాంసంగ్ వెల్లడించింది. మరియు ఈ ఫోన్ 1x వేపర్ ఛాంబర్‌ను కలిగి ఉంది. సర్కిల్ టూ సెర్చ్, నోట్ అసిస్ట్, లైవ్ ట్రాన్స్‌లేట్, కంపోజర్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది.
గెలాక్సీ S24 FE కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 3X ఆప్టికల్ జూమ్‌తో 8MP టెలీఫోటో లెన్స్ మరియు 12MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 10MP కెమెరాతో అందుబాటులో ఉంది. 25W ఛార్జింగ్ సపోర్టుతో 4700mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఈ శాంసంగ్ ప్రీమియం ఫోన్ 5G, 4G LTE, వైఫై 6E, బ్లూటూత్ 5.3, USB-C ఛార్జింగ్ పోర్టులను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. మరియు Knox Vault ఫీచర్ సహా IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.


Click it and Unblock the Notifications








