Home
Mobile

శాంసంగ్‌ సూపర్‌ ఆఫర్‌..256GB స్టోరేజీ, 6.7అంగుళాల FHD+ డిస్‌ప్లే, ట్రిపుల్‌కెమెరా 5G ఫోన్‌పై రూ.6000 డిస్కౌంట్

శాంసంగ్‌ నుంచి ఇటీవల గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్ (Samsung galaxy S24 FE Smartphone) విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రీమియం అనుభూతిని అందిస్తుందని సంస్థ చెబుతోంది. భారత్‌ మార్కెట్‌లో ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌ సహా భాగస్వామ్య స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రస్తుతం రెండు స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్‌ ఇప్పటికే భారత్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.59,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.65,999 గా ఉంది. అయితే ప్రారంభ ఆఫర్‌లో భాగంగా 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.59,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ అక్టోబర్‌ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంది.

Samsung galaxy S24 FE Smartphone introductory offer

దీంతోపాటు రూ.4799 విలువైన శాంసంగ్‌ కేర్‌+ ప్యాకేజీని రూ.999 కే (Samsung galaxy S24 FE Smartphone introductory offer) కొనుగోలు చేయవచ్చు. మరియు 12 నెలల వరకు నోకాస్ట్‌ EMI ప్రయోజనాలను పొందవచ్చు. ఈ శాంసంగ్‌ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌ను బ్లూ, గ్రాఫైట్‌, మింట్‌ రంగుల్లో లభిస్తుంది.

శాంసంగ్‌ గెలాక్సీ S24 FE స్పెసిఫికేషన్‌లు :
ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ (1080*2340 పిక్సల్స్‌) డైనమిక్‌ అమోలెడ్‌ 2X డిస్‌ప్లే ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ AI ఫీచర్‌లను కలిగి ఉంటుంది. సర్కిల్‌ టు సెర్చ్‌, లైవ్‌ ట్రాన్సిలేట్‌, నోట్‌ అసిస్ట్‌, కంపోసర్‌, Interpreter మోడ్‌ను కలిగి ఉంటుంది.

శాంసంగ్‌ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌ 4nm డెకా కోర్‌ Exynos 2400e SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 8GB ర్యామ్ మరియు 512GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 6.1 పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ రెండు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

50MP+ 8MP +12MP +10MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, OIS, 3x ఆప్టికల్‌ జూమ్‌తో 8MP టెలీఫోటో కెమెరా మరియు 12MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ వీడియో కాల్స్‌ కోసం 10MP కెమెరాను అమర్చి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 25W ఛార్జింగ్ సపోర్టుతో 4700mAh బ్యాటరీని కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో కూడిన డస్ట్‌, స్ప్లాష్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. భద్రత కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ మరియు శాంసంగ్‌ Knox Vault ఫీచర్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.3, వైఫై 6E, USB-C ఛార్జింగ్‌ పోర్ట్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung galaxy S24 FE Smartphone introductory offer get highend model at base variant price upto oct 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X