Home
Mobile

Samsung Galaxy S24 Plus : సుమారు సగం ధరకే శాంసంగ్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌.. ఈ ఆఫర్‌ మిస్‌ కావద్దు..!

శాంసంగ్‌ గత సంవత్సరం జనవరిలో గెలాక్సీ S24 ప్లస్‌ (Samsung Galaxy S24 Plus) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గెలాక్సీ S24 సిరీస్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. అయితే ఈ శాంసంగ్‌ గెలాక్సీ S24 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ పూర్తి వివరాలు.

సగం ధరకే కొనుగోలు చేయవచ్చు :
భారత్ మార్కెట్‌లో శాంసంగ్‌ గెలాక్సీ S24 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యా్మ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ఒరిజినల్‌ ధర రూ.99999 గా ఉంది. ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.52999 గా కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరో రూ.1060 తగ్గింపును పొందవచ్చు. దీంతో రూ.51939 కే సొంతం చేసుకోవచ్చు. అంటే సుమారు సగం ధరకే కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy S24 Plus smartphone now available at RS52999 on flipkart here are the best features

హై ఎండ్‌ మోడల్‌ కోసం :
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ 512GB స్టోరేజీ వేరియంట్ అందుబాటులోకి లేదు. ఈ వేరియంట్‌ ఒరిజినల్ ధర రూ.1,09,999 గా ఉంది. అమెజాన్‌లో రూ.65 వేల ధరకే కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ల కోసం చూస్తున్న వారు ఈ ఆఫర్‌ను మిస్‌ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ కోబాల్ట్ వైలెట్‌, Onyx బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
గెలాక్సీ S24 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల 2K LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 2600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 రక్షణను పొందుతుంది. మరియు సన్నని అల్యూమినియం ఫ్రేమ్‌ను కూడా కలిగి ఉంది.

Samsung Galaxy S24 Plus smartphone now available at RS52999 on flipkart here are the best features

చిప్‌సెట్‌ వివరాలు :
ఈ శాంసంగ్ ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ Exynos 2400 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ గరిష్టంగా 12GB ర్యామ్ మరియు 512GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ చాట్‌ అసిస్టెంట్‌, లైవ్‌ ట్రాన్సిలేట్‌, సర్కిల్‌ టూ సెర్చ్‌ వంటి అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది.

ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS తో పనిచేస్తోంది. మరియు ఈ ఫోన్‌ ఏకంగా 7 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. 45W వైర్‌, 15W వైర్‌లైస్ ఛార్జింగ్ సపోర్టుతో 4900mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 3x జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్‌, 12MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 12MP కెమెరాలను కలిగి ఉంది.

భారత్‌ మార్కెట్‌లో శాంసంగ్‌ గెలాక్సీ A56 5G స్మార్ట్‌ఫోన్‌ ఏప్రిల్‌ 17 వ తేదీన విడుదల కానుంది. ఈ ఫోన్‌ 7.2mm థిక్‌నెస్‌తో సూపర్‌ అమోలెడ్‌+ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతోపాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌+ ప్రొటెక్షన్‌ను పొందుతుందని సమాచారం. 50MP + 8MP+ 2MP కెమెరాలు సహా 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. మరియు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఎడిటింగ్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S24 Plus smartphone now available at RS52999 on flipkart here are the best features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X