శాంసంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలా.. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.10,000 తగ్గింపు..!
శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ ఇటీవల భారత్ లో లాంచ్ అయింది. ఈ సిరీస్ లో భాగంగా గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్, గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ లు అందుబాటులోకి వచ్చాయి. ఫిబ్రవరి 4 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది. అయితే తాజాగా శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో గెలాక్సీ S24 స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy S24 Smartphone) ధరలను భారీగా తగ్గించింది. ప్రస్తుతం శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్లో కొత్త ధరలు అప్‌డేట్ అయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ S24 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.
ఏకంగా ధర రూ.10,000 తగ్గింపు.. :
శాంసంగ్ గెలాక్సీ S24 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం మూడు స్టోరేజీ వేరియంట్ లలో లభిస్తోంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.74,999 గా ఉండేది. ఈ వేరియంట్ పై శాంసంగ్ ఏకంగా రూ.10,000 తగ్గించింది. ఫలితంగా ఈ వేరియంట్ ను రూ.64,999 కే కొనుగోలు చేయవచ్చు.

అదే విధంగా 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.79,999 గా ఉంది. దీనిపై రూ.9000 తగ్గించింది. ఫలితంగా ఈ వేరియంట్ ధర రూ.70,999 కే సొంతం చేసుకోవచ్చు. అదే హై ఎండ్ వేరియంట్ 8GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.89,999 గా ఉండగా.. రూ.7000 డిస్కౌంట్ ను అందించింది. ఫలితంగా ఫోన్ ధర రూ.82999 గా ఉంది.
మొత్తంగా రూ.20,000 డిస్కౌంట్ :
కొత్త ధరలతో శాంసంగ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. అయితే బ్యాంకు ఆఫర్లతో ఈ హ్యాండ్‌సెట్ ను అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు. HDFC బ్యాంకు క్రెడిట్ కార్డులతో అదనంగా రూ.10,000 తగ్గింపును పొందవచ్చు. దీంతో గెలాక్సీ S24 స్మార్ట్‌ఫోన్ 128GB స్టోరేజీ వేరియంట్ ను రూ.54,999 కే సొంతం చేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు :
గెలాక్సీ S24 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.2 అంగుళాల FHD+ డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 25W వైర్ ఛార్జింగ్ మరియు 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 4000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
చిప్‌సెట్, OS వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ Exynos 2400 చిప్‌సెట్ తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్, 512GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.1 OS ను కలిగి ఉంది. మూడు స్టోరేజీ వేరియంట్స్ లో భారత్ మార్కెట్ లో అందుబాటులో ఉంది.
ట్రిపుల్ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ను సపోర్టు చేస్తుంది. 12MP అల్ట్రావైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 12MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.
శాంసంగ్ గెలాక్సీ S24 స్మార్ట్‌ఫోన్ కలర్ వేరియంట్‌లు :
కనెక్టివిటీ పరంగా గెలాక్సీ S24 స్మార్ట్‌ఫోన్ 5G, 4G LTE, W-Fi 6, బ్లూటూత్ 5.3, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు కోబాల్ట్ వైలెట్, ఒనిక్స్ బ్లాక్, మార్బుల్ గ్రే, అంబర్ ఎల్లో వంటి నాలుగు రంగుల్లో లభిస్తోంది.


Click it and Unblock the Notifications








