Home
Mobile

శాంసంగ్‌ గెలాక్సీ S24 అల్ట్రా VS ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌.. ఏ ఫోన్ మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది..?

శాంసంగ్‌ నుంచి గెలాక్సీ S24 సిరీస్‌ (samsung galaxy S24 series) స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌ అయ్యాయి. జనవరి 17న నిర్వహించిన అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌లో ఈ హ్యాండ్‌సెట్లను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో గెలాక్సీ S24, S24 ప్లస్‌, S24 అల్ట్రా ఫోన్లు ఉన్నాయి.

ఈ మూడు హ్యాండ్‌సెట్లు స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉన్నాయి. అయితే గెలాక్సీ S24 అల్ట్రా, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌లో ఏది మెరుగైన ఫీచర్లను (Samsung Galaxy S24 Ultra VS iPhone 15 Pro Max) కలిగి ఉంది.

galaxy-s24-ultra-vs-iphone-15-pro-max-news

గెలాక్సీ S24 అల్ట్రా స్పెసిఫికేషన్లు : శాంసంగ్‌ గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ 6.8 అంగుళాల QHD+ డైనమిక్ అమోలెడ్‌ 2X డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1.120Hz రీప్రెష్‌ రేట్‌తో వస్తుంది. దీంతోపాటు విజన్‌ బూస్టర్‌ ఫీచర్‌ను కూడా పొందింది. 2600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ ఫ్లాటర్‌ డిస్‌ప్లే, స్లిమ్మర్‌ బెజెల్స్‌ను కలిగి ఉంటుంది. మరియు టైటానియం ఫ్రేమ్‌తో వస్తుంది.

గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ నాణ్యమైన కెమెరాలను కలిగి ఉంది. 200MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రావైడ్‌ కెమెరా, 10MP 3X టెలిఫోటో కెమెరా, 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. స్టోరేజీ విషయానికి వస్తే 12GB ర్యామ్‌ వేరియంట్‌తో 256GB, 512GB, 1TB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. టైటానియం గ్రే, టైటానియం బ్లాక్‌, టైటానియం వైలెట్, టైటానియం యెల్లో రంగుల్లో అందుబాటులో ఉంది.

galaxy-s24-ultra-vs-iphone-15-pro-max-news

గెలాక్సీ S24 అల్ట్రా 12GB ర్యామ్ +256GB వేరియంట్‌ ధర $1299 ( భారత కరెన్సీలో రూ.98,300), 12GB ర్యా్మ్‌ +512GB ధర $1,419 (భారత కరెన్సీలో రూ.1,18,000) మరియు 12GB ర్యామ్‌+ 1TB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర $1,659 (భారత కరెన్సీలో రూ.1,38,000) గా ఉంది.

ఐఫోన్‌ 15ప్రో మ్యాక్స్‌: 6.7 అంగుళాల సూపర్‌ రెటీనా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. A17 ప్రో చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 48MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. తక్కువ లైటింగ్‌లోనూ నాణ్యమైన ఫొటోలు క్యాప్చర్‌ చేయవచ్చు. ఈ కెమెరా ద్వారా 4K60 ProRes నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు. ఈ ఫోన్ ఆల్‌వేస్‌ ఆన్‌ డిస్‌ప్లే ఫీచర్‌తో వస్తుంది. తాజాగా iOS 17 పొందింది.

శాంసంగ్‌ గెలాక్సీ S24 అల్ట్రా VS ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌: S24 సిరీస్‌లో OS అప్‌డేట్‌ను పొందింది. ఐఫోన్‌ 15 ఎప్పటివరకు పనిచేస్తుందో వెల్లడి కాలేదు. అయితే సాధారంగా ఈ OSలు దీర్ఝకాలం మన్నికను కలిగి ఉంటాయి. గెలాక్సీ S24 సిరీస్‌ మెరుగైన సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను కలిగి ఉంది. AI ప్యాక్‌ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో లైవ్‌ ట్రాన్స్‌లేట్‌, చాట్‌ అసిస్ట్‌, ట్రాన్ర్సిప్ట్‌ అసిస్ట్‌ వంటి ఫీచర్లున్నాయి.

అయితే ప్రస్తుతానికి శాంసంగ్‌ AI ఆధారిత ఫీచర్లను కలిగి ఉన్నప్పటికీ.. త్వరలో ఆపిల్‌ సంస్థ కూడా AppleGPT ని తన హ్యాండ్‌సెట్‌లో పొందుపరిచే అవకాశం ఉంది. ధర విషయానికి వస్తే శాంసంగ్‌ S24 అల్ట్రా హైఎండ్‌ మోడల్‌ రూ.1.38 లక్షలుగా ఉంది. అదే ఆపిల్‌ ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ధర సుమారుగా రూ.2 లక్షలుగా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
samsung galaxy S24 ultra VS iphone 15 pro max which one to choose
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X