ఆకట్టుకొనే డిజైన్, అదిరిపోయే ఫీచర్‌లతో శాంసంగ్ గెలాక్సీ S25, S25 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల..!
శాంసంగ్ అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్‌లో గెలాక్సీ S25 సిరీస్‌ను (Samsung Galaxy S25 Series) లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్, గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉన్నాయి. అయితే బేస్ వేరియంట్‌తో పోలిస్తే ప్లస్ వేరియంట్ పెద్ద డిస్‌ప్లేతోపాటు భారీ బ్యాటరీని కలిగి ఉంది. బేస్, ప్లస్ మోడళ్లు స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. 7 సంవత్సరాలపాటు అప్‌డేట్‌లను పొందనుంది.
శాంసంగ్ గెలాక్సీ S25 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy S25 Smartphone) 6,2 అంగుళాల FHD+ డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ డిస్‌ప్లే సూపర్ స్మూత్ 120Hz రీఫ్రెష్ రేట్, 2600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే విజన్ బూస్టర్, అడాప్టివ్ కలర్ టోన్‌ను సపోర్టు చేస్తుంది.

7 సంవత్సరాలపాటు అప్‌డేట్‌లు :
ఈ శాంసంగ్ గెలాక్సీ S25 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 7 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందించనుంది.
స్టోరేజీ వేరియంట్‌లు, బ్యాటరీ వివరాలు :
12GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ 25W వైర్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 4000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.

సూపర్ కెమెరాలు :
ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. f/1.8 అపేచర్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP వైడ్ కెమెరా, f/2.2 అపేచర్, 120 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 12MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, f/2.4 అపేచర్, 3X ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్ కోసం f/2.2 అపేచర్‌తో 12MP కెమెరాను అమర్చి ఉంది.
గెలాక్సీ S25 ప్లస్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఈ ఫోన్ (Samsung Galaxy S25 Plus) 6.7 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేతో లాంచ్ అయింది. 120Hz రీఫ్రెష్ రేట్, 2600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ 12GB LPDDR5x ర్యామ్‌తో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 7 ఆండ్రాయిడ్ OS, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది. ఈ ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ ఫోన్ 45W ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 4900mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. f/1.8 అపేచర్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP వైడ్ కెమెరా, f/2.2 అపేచర్, 120 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 12MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, f/2.4 అపేచర్, 3X ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్ కోసం f/2.2 అపేచర్‌తో 12MP కెమెరాను అమర్చి ఉంది.
కనెక్టివిటీ పరంగా ఈ రెండు ఫోన్‌లు 5G, 4G LTE, బ్లూటూత్ 5.3, వైఫై 6E, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. గూగుల్ సర్కిల్ టూ సెర్చ్, కాల్ ట్రాన్స్‌క్రిప్ట్, రైటింగ్ అసిస్టెంట్, డ్రాయింగ్ అసిస్టెంట్ వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉన్నాయి.
ధరల వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ S25 ప్రారంభ ధర $799 (భారత్ కరెన్సీ ప్రకారం సుమారు రూ.69,074) గా ఉంది. అదే గెలాక్సీ S25 ప్లస్ మోడల్ ప్రారంభ ధర రూ.999 గా ఉంది. ఈ రెండు వేరియంట్‌లు సిల్వర్ షాడో, నేవీ, ఐసీ బ్లూ, మింట్ రంగుల్లో లభించనున్నాయి. అయితే భారత్ ధరలు సహా సేల్ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








