శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే, ధర వివరాలు లీక్.. ఎప్పుడు విడుదల కానుందంటే?
శాంసంగ్ ఈ సంవత్సరం జనవరిలో నెలలో గెలాక్సీ S25 సిరీస్ విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్, గెలాక్సీ S25 అల్ట్రా హ్యాండ్‌సెట్‌లు లాంచ్ అయ్యాయి. త్వరలో శాంసంగ్ నుంచి S25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy S25 Edge) లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ఇటీవల జరిగిన వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ 2025 లో ప్రదర్శించారు. గెలాక్సీ S25 సిరీస్ తరహాలోని కొన్ని ప్రత్యేక ఫీచర్‌లు ఈ ఫోన్‌లోనూ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
శక్తివంతమైన చిప్‌సెట్ :
శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో గ్లోబల్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే, ధర సహా ఇతర వివరాలు లీక్ అయ్యాయి.

కీలక వివరాలు లీక్ :
గెలాక్సీ S25 ఎడ్జ్ ఫోన్ కీలక వివరాలను టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ (@UniverseIce) X పోస్ట్ ద్వారా వెల్లడించారు. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ 6.65 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డిజైన్ పరంగా చిన్న బెజెల్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఈ ఎడ్జ్ మోడల్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఎడ్జ్ వేరియంట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ మోడల్ కేవలం 5.84mm థిక్‌నెస్‌ను మాత్రమే కలిగి ఉంటుందని చెప్పారు. మరియు 162 గ్రాముల బరువును కలిగి ఉంటుందని వెల్లడించారు.
ధర వివరాలు లీక్ :
టిప్‌స్టర్ వివరాల గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ ధర వివరాలను కూడా వెల్లడించారు. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ ధర సుమారుగా $999 (భారత కరెన్సీ ప్రకారం రూ.87,150) గా ఉంటుంది తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ ఏప్రిల్‌లో భారత్‌లో లాంచ్ కానుంది.
అయితే శాంసంగ్ మాత్రం ఈ ఎడ్జ్ వేరియంట్ లాంచ్ పై ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ వేరియంట్ వెనుక ప్యానల్ గ్లాస్ కు బదులుగా సిరామిక్ మెటీరియల్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
* జనవరిలో గెలాక్సీ S25 సిరీస్ విడుదల అయింది. ఇందులో గెలాక్సీ S25 అల్ట్రా టాప్ వేరియంట్‌గా ఉంది. ఈ ఫోన్ 6.9 అంగుళాల డైనమిక్ 2X డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 OS, స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌ను కలిగి ఉంది. అనేక ఆప్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది.
వెనుక వైపు నాలుగు కెమెరాలను కలిగి ఉంది. 200MP + 50MP + 50MP + 10MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. మరియు 12MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. 45W వైర్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications








