Home
Mobile

200MP కెమెరాతో శాంసంగ్‌ గెలాక్సీ S25 ఎడ్జ్‌ స్మార్ట్‌ఫోన్‌.. ఎప్పుడు విడుదల కానుందంటే?

Samsung Galaxy S25 Edge Smartphone : శాంసంగ్‌ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్‌ గురించి కీలక ప్రకటన వెలువడింది. ఇప్పటికే గత కొన్ని నెలలుగా ఈ హ్యాండ్‌సెట్‌ కోసం అనేక వివరాలు లీక్‌ అవుతున్నాయి. తాజాగాగ శాంసంగ్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీని ప్రకటన చేసింది. చాలా దేశాల్లో ఈ హ్యాండ్‌సెట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ సంవత్సరం శాంసంగ్‌ నుంచి S25 సిరీస్‌ లాంచ్‌ అయింది. త్వరలో విడుదల కానున్న కొత్త ఫోన్‌ స్లిమ్‌ డిజైన్‌తో కలిగి ఉంటుంది.

శాంసంగ్ ఫోన్‌ ఎప్పుడు లాంచ్‌ కానుంది? :
శాంసంగ్‌ గెలాక్సీ S25 ఎడ్జ్‌ విడుదల తేదీని సంస్థ తాజాగా వెల్లడించింది. భారత్‌లో మే 13 వ తేదీన 5.30 AM గంటలకు ఈ ఫోన్ లాంచ్‌ కానుంది. కాలిఫోర్నియాలో మే 12 సాయంత్రం 5PM, న్యూయార్క్‌లో మే 12 వ తేదీ 8PM గంటలకు ఈ ఈవెంట్‌ టెలికాస్ట్‌ కానుంది. శాంసంగ్ సోషల్‌ మీడియా ద్వారా ఈ ప్రకటన చేసింది. శాంసంగ్ అధికారిక యూట్యూబ్‌ ఛానల్ ద్వారా ఈవెంట్‌ లైవ్‌ చూడవచ్చు.

Samsung galaxy S25 Edge Smartphone launch date

అల్ట్రా స్లిమ్‌ డిజైన్‌ :
ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన అనేక వివరాలు లీక్‌ అయ్యాయి. ఈ ఫోన్‌ అత్యంత సన్నని డిజైన్‌తో లాంచ్ కానుంది. కేవలం 5.84mm థిక్‌నెస్‌తో అల్ట్రా స్లిమ్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. శాంసంగ్ ప్రీమియం ఫోన్‌లలో అత్యంత సన్నని ఫోన్‌ ఇదేనని తెలుస్తోంది.

శాంసంగ్‌ గెలాక్సీ S25 ఎడ్జ్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు! :
ఈ గెలాక్సీ S25 ఎడ్జ్‌ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.65 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 ప్రొటెక్షన్‌ ను పొందుతుంది. ఈ ఫోన్‌ కేవలం 162 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

శక్తివంతమైన ప్రాసెసర్‌ :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా గెలాక్సీ S25 ఎడ్జ్ హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 12GB ర్యామ్‌, 512GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత శాంసంగ్‌ One UI 7 ను కలిగి ఉంటుంది.

200MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ శాంసంగ్ అల్ట్రా స్లిమ్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 85 డిగ్రీల ఫీల్డ్‌వ్యూ, f/1.7 అపేచర్‌తో 200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు 120 డిగ్రీల ఫీల్డ్‌వ్యూ, f/2.2 అపేచర్‌తో 12MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.

బ్యాటరీ, ఛార్జింగ్‌ వివరాలు :
దీంతోపాటు 80 డిగ్రీల ఫీల్డ్‌వ్యూ, f/2.2 అపేచర్‌తో 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ శాంసంగ్ హ్యాండ్‌సెట్‌ 25W వైర్ ఛార్జింగ్‌ సపోర్టుతో 3900mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్‌ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung galaxy S25 Edge Smartphone launch date revealed in india, here are the confirmed specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X