Home
Mobile

శాంసంగ్ అల్ట్రా స్లిమ్ ఫోన్‌ వచ్చేసింది.. 200MP కెమెరా, స్నాప్‌డ్రాగన్‌ 8 Elite చిప్‌సెట్‌..!

Samsung Galaxy S25 Edge Launched : శాంసంగ్‌ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అల్ట్రా స్లి్మ్‌ ప్రీమియం ఫోన్‌ గ్లోబల్ మార్కెట్‌లో ఇవాళ విడుదల అయింది. ఈ ఫోన్ కేవలం 5.8mm థిక్‌నెస్‌ను మాత్రమే కలిగి ఉంది. మరియు 163 గ్రాముల బరువును కలిగి ఉంది. ఈ సంవత్సరం తొలి రోజుల్లో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్‌ విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా తాజాగా శాంసంగ్‌ గెలాక్సీ S25 ఎడ్జ్‌ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది.

డిస్‌ప్లే వివరాలు :
శాంసంగ్‌ గెలాక్సీ S25 ఎడ్జ్‌ స్మార్ట్‌ఫోన్‌ టఫ్‌ టైటానియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ 6.7 అంగుళాల QHD+ అమోలెడ్‌ ప్యానల్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. మరియు కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ సిరామిక్‌ 2 గ్లాస్‌ ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

Samsung Galaxy S25 Edge

శక్తివంతమైన చిప్‌సెట్‌ :
గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 8 Elite SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB LPDDR5x ర్యామ్ మరియు 512GB UFS 4.0 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత One UI 7 ను కలిగి ఉంటుంది.

ఏకంగా 7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
దీంతోపాటు అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. ఇందులో సర్కిల్‌ టూ సెర్చ్‌, కాల్‌ ట్రాన్స్‌క్రిప్ట్‌, డ్రాయింగ్‌ అసిస్టెంట్‌, రైటింగ్‌ అసిస్టెంట్‌ వంటి ఫీచర్‌లున్నాయి. ఈ ఫోన్‌ ఏకంగా 7 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

Samsung Galaxy S25 Edge

200MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ శాంసంగ్‌ అల్ట్రా స్లిమ్‌ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 2X ఆప్టికల్ క్వాలిటీ జూమ్‌తో 200MP ప్రైమరీ, 12MP అల్ట్రా వైడ్‌ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాను అమర్చారు.

ఈ శాంసంగ్‌ గెలాక్సీ S25 ఎడ్జ్‌ స్మార్ట్‌ఫోన్‌ 25W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 3900mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కేవలం 30 నిమిషాల్లో 55 శాతం ఛార్జింగ్‌ చేయవచ్చు. అయితే ఛార్జర్‌ను ప్రత్యేకంగా కొనుగోలు చేయాలని ఉంటుందని శాంసంగ్‌ తెలిపింది.

గెలాక్సీ S25 ఎడ్జ్ ప్రారంభ ధర $1099.99 9భారత్‌ కరెన్సీ ప్రకారం రూ.93,352) గా ఉంది. ఈ ఫోన్‌ టైటానియం సిల్వర్‌, టైటానియం జెట్‌ బ్లాక్‌, టైటానియం ఐసీబ్లూ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

ఈ ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో ఇవాళ లాంచ్‌ కావాల్సి ఉంది. అయితే ఇటీవల తలెత్తిన భారత్‌, పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా విడుదలను వాయిదా వేసింది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ లిస్టింగ్‌ ఆధారంగా ఈ శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్‌ మోడల్‌ భారత్‌లో ఇవాళే విడుదల కానుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S25 Edge smartphone launched Globally with 200MP Camera and Snapdragon 8 Elite chipset
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X