Home
Mobile

తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ కోసం చూస్తున్నారా.. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫోన్‌ కీలక వివరాలు లీక్!

Samsung Galaxy S25 FE Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్ సెప్టెంబర్ 4 వ తేదీన గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ను (Galaxy Unpacked Event 2025) నిర్వహించనుంది. ఇందులో భాగంగా గెలాక్సీ ట్యాబ్‌ S11 సిరీస్‌ విడుదల కానుంది. ప్రస్తుతం ఈ ట్యాబ్లెట్‌ను ముందస్తు బుకింగ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఈ ట్యాబ్లెట్‌తోపాటు గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్‌ కూడా విడుదల కానుందని తెలుస్తోంది.

నాలుగు కలర్‌ వేరియంట్స్ :
ఈ ఫోన్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. గెలాక్సీ S25 FE టీజర్‌ విడుదల అయింది. S25 సిరీస్‌లోని అనేక ఫ్లాగ్‌షిఫ్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ డిజైన్‌ సహా కొన్ని స్పెసిఫికేషన్‌ల వివరాలు గ్లోబల్ లిస్టింగ్‌ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్‌ నేవీ, జెట్‌బ్లాక్, వైట్‌, ఐసీ బ్లూ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Samsung Galaxy S25 FE Smartphone key specifications  features  price leaked ahead of galaxy unpacked event

డిస్‌ప్లే :
ప్రస్తుత అంచనా వివరాల ఆధారంగా శాంసంగ్ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల FHD+ LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. మెరుగైన విజువల్‌ అనుభూతి కలుగుతుందని భావిస్తున్నారు.

ఈ హ్యాండ్‌సెట్‌ Exynos 2400 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్‌ 12GB LPDDR5x ర్యామ్‌, 256GB UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉండే అవకాశం ఉంది. మల్టీ టాస్కింగ్, గేమింగ్‌ సమయాల్లోనూ మెరుగైన పనితీరను అందిస్తుందని తెలుస్తోంది.

7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8.0 పైన పనిచేసే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 6 లేదా 7 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ OS, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందించే అవకాశం ఉంది. మరియు ఈ ఫోన్ 45W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4900mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టును కూడా కలిగి ఉండే అవకాశం ఉంది.

ట్రిపుల్ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP కెమెరా, 12MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 3x ఆప్టికల్ జూమ్‌తో 8MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాను అమర్చే అవకాశం ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్‌ 7.8mm థిక్‌నెస్‌, 190 గ్రాముల బరువును కలిగి ఉండే అవకాశం ఉంది. మెరుగైన ఆడియో అవుట్‌పుట్‌ కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్‌ భారత్ మార్కెట్‌లో సుమారు రూ.60 వేల ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ధరపై శాంసంగ్‌ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ సెప్టెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌, వెబ్‌సైట్ ద్వారా లైవ్ చూడవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S25 FE Smartphone key specifications, features, price leaked
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X