శాంసంగ్ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. ఎప్పుడు విడుదల కానుంది?
శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఇటీవల భారత్ మార్కెట్‌లో లాంచ్ అయ్యాయి. అయితే త్వరలో ఈ సిరీస్ నుంచి మరో హ్యాండ్‌సెట్ విడుదల కానుందని తెలుస్తోంది గెలాక్సీ S25 FE పేరుతో (Samsung Galaxy S25 FE) ఈ ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా టిప్‌స్టర్ దెబయన్ రాయ్ ఈ హ్యాండ్‌సెట్ గురించి కీలక వివరాలు వెల్లడించారు. దీంతోపాటు FE మోడల్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలను కూడా లీక్ చేశారు.
టిప్‌స్టర్ దెబయన్ రాయ్ వివరాల ఆధారంగా శాంసంగ్ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో సెప్టెంబర్ చివర్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో గ్లోబల్ మార్కెట్‌లనూ విడుదల కానుందని తెలిపారు. దీంతోపాటు ఇతర వివరాలను కూడా వెల్లడించారు.

శాంసంగ్ గెలాక్సీ S25 FE అంచనా స్పెసిఫికేషన్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ HD+ LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. స్లిమ్ బెజెల్స్‌తో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 7.8mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.
చిప్‌సెట్ :
ఈ హ్యాండ్‌సెట్ Exynos 2400 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB LPDDR5x ర్యామ్, 256GB UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంటుందని సమాచారం. X పోస్ట్ ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
Galaxy S25 FE :
— Debayan Roy (Gadgetsdata) (@Gadgetsdata) July 16, 2025
✅ 6.7" FHD+ 120Hz LTPO flat oled 🔴 Slim bezels like M56
✅ Exynos 2400
✅ LPDDR5X, UFS 4
✅ 50MP OIS +12 UW + 8MP 3x telephoto 🤳12MP
✅ 4900mAh🔋45W(likely)⚡wireless
✅ Android 16 , One UI 8
✅ Dual 🔊,IP68,faster USB
✅ 7.8mm, 190g
✅ Launch ~ September end
7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్! :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8.0 (skin on top) పైన పనిచేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ 6 లేదా 7 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS లేదా సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 3x జూమ్‌తో 8MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 12MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
వైర్‌లెస్ ఛార్జింగ్ :
ఈ హ్యాండ్‌సెట్ 25W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 4900mAh బ్యాటరీతో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ వైర్‌లైస్ ఛార్జింగ్ ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ మెరుగైన ఆడియో అవుట్‌పుట్ కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో రూ.60 వేల ప్రారంభ ధరకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ గురించి త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ విడుదల, స్పెసిఫికేషన్లపై శాంసంగ్ ఎటుపంటి ప్రకటన చేయలేదు.


Click it and Unblock the Notifications








