Home
Mobile

Samsung india శాంసంగ్‌ కొత్త స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్‌.. Slim డిజైన్‌, శక్తివంతమైన ప్రాసెసర్‌ సహా..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్‌ నుంచి గత నెలలో గెలాక్సీ S24 FE హ్యాండ్‌సెట్ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. అయితే గెలాక్సీ S24 FE తర్వాత తరం హ్యాండ్‌సెట్‌గా గెలాక్సీ S25 FE (Samsung Galaxy S25 FE Smartphone) విడుదల కానుంది. దీనికి సంబంధించిన కీలక వివరాలు తాజాగా లీక్‌ అయ్యాయి. గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ కొత్త చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు సన్నని డిజైన్‌ సహా భారీ బ్యాటరీలో విడుదల కానుందని తెలుస్తోంది.

టిప్‌స్టర్‌ jukanlosreve వివరాల ఆధారంగా శాంసంగ్‌ గెలాక్సీ S25 SE స్మార్ట్‌ఫోన్ వచ్చే సంవత్సరం విడుదల కానుందని తెలుస్తోంది. ఇటీవల వచ్చిన గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్ తరహాలోనే గెలాక్సీ S25 FE హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు సన్నని డిజైన్‌తో అందుబాటులో రానుందని సమాచారం.

Samsung Galaxy S25 FE Smartphone

ఈ గెలాక్సీ S25 FE హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌ తో పనిచేస్తుందని టిప్‌స్టర్‌ తెలిపారు. దీంతోపాటు శాంసంగ్‌ గెలాక్సీ S25, గెలాక్సీ S25+, గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 4 చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టిప్‌స్టర్‌ తెలిపారు. గెలాక్సీ S25 సిరీస్‌ 2025 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

* భారత్‌ మార్కెట్‌లో గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్ సేల్‌ అక్టోబర్ 7 నుంచి ప్రారంభం అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.59,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.65,999 గా ఉంది. ఈ ఫ్యాన్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ను బ్లూ, గ్రాఫైట్‌, మింట్‌ రంగుల్లో లభిస్తుంది.

శాంసంగ్‌ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల FHD+ డైనమిక్‌ అమోలెడ్‌ 2X డిస్‌ప్లే ను కలిగి ఉంది. 4nm డెకా కోర్‌ Exynos 2400e SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 6.1 OS ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ AI ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. సర్కిల్‌ టూ సెర్చ్‌, లైవ్‌ ట్రాన్సిలేట్‌, నోట్‌ అసిస్ట్ సహా మరిన్ని ఫీచర్‌లను కలిగి ఉంది.

గెలాక్సీ S24 FE హ్యాండ్‌సెట్ OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌తో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు OIS, 3X ఆప్టికల్‌ జూమ్‌తో 8MP టెలీఫోటో కెమెరా, 12MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను కలిగి ఉంది. మరియు 10MP కెమెరాతో అందుబాటులో ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌ 25W ఛార్జింగ్ సపోర్టుతో 4700mAh బ్యాటరీతో పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ సెక్యూరిటీ కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, శాంసంగ్‌ Knox Vault ఫీచర్‌ను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో కూడిన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌తో అందుబాటులో ఉంది. బ్లూటూత్‌ 5.3, వైఫై 6E వంటి కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S25 FE Smartphone may feature slim design and New chipset full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X