శాంసంగ్ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ సేల్.. 50MP కెమెరా, ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ సహా సూపర్ ఫీచర్లు..!
Samsung Galaxy S25 FE Smartphone Sale : శాంసంగ్ ఈ నెల తొలివారంలో గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో శాంసంగ్ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ ను ఆవిష్కరించింది. ఈ హ్యాండ్‌సెట్ సేల్ భారత్ మార్కెట్‌లో తాజాగా ప్రారంభం అయింది. ఈ ఫోన్ 7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ ను పొందుతుంది. 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ధర, సేల్ వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59,999 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.65,999, 8GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.77999 గా ఉంది. ఈ ఫోన్‌ను శాంసంగ్ వెబ్‌సైట్, శాంసంగ్ స్టోర్‌లు, ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.5 వేల డిస్కౌంట్ ను పొందవచ్చు. దీంతోపాటు 24 నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. రూ.4199 చెల్లించి, రెండు సంవత్సరాల వరకు స్క్రీన్ ప్రొటెక్షన్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ నేవీ, జెట్ బ్లాక్, వైట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ డైనమిక్ అమోలెడ్ 2x డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే విజన్ బూస్టర్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా విక్టస్+ ప్రొటెక్షన్, ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ ను కలిగి ఉంది.
7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ 4nm Exynos 2400 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 7 ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. జెమిని లైవ్, సర్కిల్ టూ సెర్చ్ వంటి అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లను కలిగి ఉంది.

మూడు కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా మరియు 3x ఆప్టికల్ జూమ్‌తో 8MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 12MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది.
IP68 రేటింగ్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 45W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 4900mAh బ్యాటరీను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. 1.5 మీటర్ల స్వచ్చమైన నీటిలో 30 నిమిషాలపాటు ఉంచినా డ్యామేజీ కాదని శాంసంగ్ చెబుతోంది. ఈ హ్యాండ్‌సెట్ Knox Vault ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








