Home
Mobile

శాంసంగ్‌ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ విడుదల.. ఆండ్రాయిడ్‌ 16 OS, అదిరిపోయే డిజైన్‌, సూపర్‌ ఫీచర్లు సహా..!

Samsung Galaxy S25 FE Smartphone : శాంసంగ్‌ సంస్థ ఇవాళ గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ (Galaxy Unpacked Event 2025) నిర్వహించింది. ఇందులో శాంసంగ్ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్‌తోపాటు గెలాక్సీ ట్యాబ్ S11 సిరీస్‌ను లాంచ్‌ చేసింది. గెలాక్సీ S25 సిరీస్‌ ఈ సంవత్సరం తొలి భాగంలో విడుదల అయింది. మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ టెలిఫోటో లెన్స్‌, 45W ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

శాంసంగ్‌ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్‌ HD+ డైనమిక్ అమోలెడ్‌ 2x డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1900 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌, విజన్‌ బూస్టర్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 190 గ్రాముల బరువును కలిగి ఉంది. ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది.

samsung galaxy S25 FE Smartphone

7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్‌ 4nm Exynos 2400 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 8GB/128GB, 8GB/256GB, 8GB/512GB వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ 7 ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS), f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.2 అపేచర్‌తో 12MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 3x ఆప్టికల్‌ జూమ్‌, f/2.2 అపేచర్‌ తో 8MP టెలిఫోటో కెమెరాను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.2 అపేచర్‌తో 12MP కెమెరాను అమర్చి ఉంది.

samsung galaxy S25 FE Smartphone

4900mAh బ్యాటరీ :
గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ 45W వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 4900mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది. జెమిని లైవ్, సర్కిల్ టూ సెర్చ్‌ సహా మరిన్ని ఫీచర్లున్నాయి.

కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, వైఫై 6E, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. 1.5 మీటర్ల స్వచ్చమైన నీటిలో 30 నిమిషాలపాటు ఉంచినా డ్యామేజీ కాదని శాంసంగ్ చెబుతోంది. ఈ ఫోన్ Knox Vault ను కూడా కలిగి ఉంది.

samsung galaxy S25 FE Smartphone

శాంసంగ్ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర $650 (భారత కరెన్సీ ప్రకారం రూ.57,300) గా ఉంది. అయితే భారత్‌లో ఈ ఫోన్‌ ధర సహా సేల్ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. త్వరలోనే విడుదల అయ్యే అవకాశం ఉంది. ఐస్‌ బ్లూ, జెట్‌ బ్లాక్‌, నేవీ, వైట్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
samsung galaxy S25 FE Smartphone with Exynos 2400 chip launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X