శామ్‌సంగ్ గెలాక్సీ S25 ఇప్పుడు రూ.73,999కే.. కొనడానికి 4 కారణాలున్నాయి.. కానీ ఒక్కటే మైనస్..?
Samsung Galaxy S25: శామ్‌సంగ్ గెలాక్సీ S25 మొబైల్ వచ్చి 15 రోజులైంది. S25 అల్ట్రా మోడల్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ, ఈ స్టాండర్డ్ S25 కూడా ఏ మాత్రం తక్కువ కాదు. చిన్న సైజులో అదిరిపోయే ఫీచర్లు ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ కావాలంటే మార్కెట్లో చాలా తక్కువ ఆప్షన్లు ఉన్నాయి. షియోమీ 14 కూడా ఒక ఆప్షన్ కానీ, శామ్‌సంగ్ గెలాక్సీ S సిరీస్‌ను చాలా మంది నమ్ముతారు.
ఐఫోన్ 15 లేదా 16 కూడా తీసుకోవచ్చు, కానీ ఆండ్రాయిడ్ ఫోనే కావాలంటే మాత్రం గెలాక్సీ S25 బెస్ట్ ఛాయిస్. మరి ఇది కొనొచ్చా, వద్దా? ఇప్పుడు చూద్దాం. ఈ ఫోన్ కొనడానికి 4 రీజన్స్ ఉన్నాయి, అలాగే ఒక్కసారి ఆలోచించాల్సిన రీజన్ గురించి తెలుసుకుందాం.

* పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్
ఈ ఫోన్‌లో మేజర్ అప్‌గ్రేడ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్. ఇది లాస్ట్ ఇయర్ చిప్ కంటే చాలా ఫాస్ట్, అంతేకాదు గెలాక్సీ S24లో ఉన్న ఎక్సీనోస్ 2400 కంటే సూపర్ ఫాస్ట్. గేమింగ్ ఆడేటప్పుడైనా ఫోన్ ల్యాగ్ అవ్వదు. ఒకేసారి చాలా యాప్స్ వాడేటప్పుడైనా ఉండదు.
యాప్స్ మధ్యలో స్విచ్ అయ్యేటప్పుడు కూడా స్లో అవ్వదు.శామ్‌సంగ్ వాళ్లు కూలింగ్ సిస్టమ్‌ను కూడా 15% ఇంప్రూవ్ చేశారు. అంటే ఎంతసేపు వాడినా ఫోన్ వేడెక్కకుండా చల్లగా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో వాడుతున్నప్పుడు హీటింగ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గిపోయాయి.
* 12GB RAMతో స్మూత్ పర్ఫార్మెన్స్
శామ్‌సంగ్ ఈసారి S25 సిరీస్‌లో అన్ని మోడల్స్‌లోనూ 12GB RAM స్టాండర్డ్‌గా ఇచ్చింది. గెలాక్సీ S24లో 8GB RAM మాత్రమే ఉండేది. అది కూడా బాగానే పనిచేస్తుంది కానీ, హెవీ యూజర్స్‌కి మాత్రం సరిపోయేది కాదు. ఎక్కువ RAM ఉంటే ఫోన్ సూపర్ ఫాస్ట్ గా పనిచేస్తుంది.
మల్టీ టాస్కింగ్ ఈజీ అవుతుంది. గేమింగ్ కూడా అదిరిపోతుంది. యాప్స్ రీలోడ్ అవ్వకుండా ఎక్కువసేపు ఓపెన్‌లోనే ఉంటాయి, కెమెరా ప్రాసెసింగ్ కూడా చాలా క్విక్ గా అవుతుంది. మొత్తానికి ఫోన్ వాడే ఎక్స్‌పీరియన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది, ఇంకా చాలా సంవత్సరాల వరకు ఫోన్ స్పీడ్‌గా పనిచేస్తుంది.
* ఇంప్రూవ్డ్ కెమెరా ఫీచర్స్..
గెలాక్సీ S25 కెమెరా హార్డ్‌వేర్ దాదాపు S24 లాగే ఉంటుంది కానీ, ఇమేజ్ ప్రాసెసింగ్ మాత్రం చాలా బాగుంది. ఫొటోలు షార్ప్‌గా వస్తాయి, కలర్స్ నాచురల్‌గా కనిపిస్తాయి, స్కిన్ టోన్స్ కూడా బాగున్నాయి. శామ్‌సంగ్ కొత్తగా కొన్ని సాఫ్ట్‌వేర్ ఫీచర్స్‌ను కూడా యాడ్ చేసింది.
వీడియో రికార్డ్ చేసేటప్పుడు లెన్స్ స్విచ్చింగ్ స్మూత్‌గా ఉంటుంది, జూమ్ స్లైడర్‌ను కూడా రీడిజైన్ చేశారు. 'ఎక్స్‌పర్ట్ రా' మోడ్‌లో ఎక్స్‌పోజర్ మానిటరింగ్, ND ఫిల్టర్ అడ్జస్ట్‌మెంట్స్, వర్చువల్ అపెర్చర్ కంట్రోల్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. దీనివల్ల బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ ఇంకా బాగా వస్తుంది.
* సన్నగా, పట్టుకోవడానికి కంఫర్ట్‌గా డిజైన్..
గెలాక్సీ S25 డిజైన్‌లో చిన్న చిన్న మార్పులు చేశారు. నావీ, ఐసీ బ్లూ వంటి కొత్త కలర్స్‌లో వస్తోంది. కెమెరా రింగ్స్‌ను బ్లాక్ కలర్‌లో ఇచ్చారు, దీనివల్ల ఫోన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. బెజెల్స్ కొంచెం సన్నగా చేశారు. ఫోన్ మందం 7.6mm నుంచి 7.2mm కి తగ్గించారు.
* మైనస్ పాయింట్
ఈ ఫోన్‌లో ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే బ్యాటరీ. శామ్‌సంగ్ ఈ ఫోన్‌లో 4,000mAh బ్యాటరీనే కంటిన్యూ చేసింది, ఇది పెద్ద బ్యాటరీ అయితే కాదు. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్ ఎఫిషియెంట్‌గా పనిచేయడం వల్ల బ్యాటరీ లైఫ్ S24 కంటే కొంచెం బెటర్‌గా ఉంటుంది.
నార్మల్‌గా వాడితే రోజంతా బ్యాటరీ వస్తుంది కానీ, చాలా ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలంటే మాత్రం పెద్ద బ్యాటరీ ఉన్న ఫోన్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. చిన్న సైజులో, ఫాస్ట్‌గా, ప్రీమియం ఫీచర్లతో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ కావాలంటే ఇది బెస్ట్ ఛాయిస్. బ్యాటరీ లైఫ్ ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇంకొంచెం ఆలోచించుకోవడం బెటర్.


Click it and Unblock the Notifications








