ఏకంగా రూ.25 వేల డిస్కౌంట్.. 7 సంవత్సరాల అప్‌డేట్స్, 50MP కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్!
Samsung Galaxy S25 Plus 5G Smartphone : దిగ్గజ సంస్థ శాంసంగ్ గత సంవత్సరం భారత్ మార్కెట్‌లో గెలాక్సీ S25 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్, గెలాక్సీ S25 అల్ట్రా మోడల్స్ లాంచ్ అయ్యాయి. అనంతరం FE, ఎడ్జ్ మోడల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ సిరీస్ ప్రీమియం సెగ్మెంట్‌లో లాంచ్ అయింది. ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు ఉన్నాయి.
ఏకంగా రూ.25 వేల డిస్కౌంట్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ను ఏకంగా రూ.25 వేల డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ విడుదల సమయంలో 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.99999 గా ఉండేది. అయితే ప్రస్తుతం రూ.74999 ధరకు అందుబాటులో ఉంది.

అంటే ఏకంగా రూ.25 వేల డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ కూడా తగ్గింపు ధరకే అందుబాటులోకి వచ్చినా, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో స్టాక్ లేదు. గెలాక్సీ S26 సిరీస్ త్వరలో లాంచ్ కానుందన్న లీక్స్ వస్తున్నాయి.
అమోలెడ్ డిస్‌ప్లే :
శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల క్వాడ్ HD+ డైనమిక్ అమోలెడ్ 2x డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ సిల్వర్ షాడో, నేవీ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

శక్తివంతమైన చిప్, 7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 7 ఆండ్రాయిడ్ OS, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని శాంసంగ్ తెలిపింది. ఈ ఫోన్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది.
50MP OIS కెమెరా, టెలిఫోటో లెన్స్ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 120 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 12MP అల్ట్రావైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది.
వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు :
సెల్ఫీ, వీడియో కాల్స్ 12MP కెమెరాను కలిగి ఉంది. సర్కిల్ టూ సెర్చ్, కాల్స్ ట్రాన్స్‌క్రిప్ట్, రైటింగ్ అసిస్టెంట్, డ్రాయింగ్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 45W ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 4900mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, NFC, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








