Home
Mobile

Galaxy Unpacked 2025 శాంసంగ్‌ గెలాక్సీ S25 సిరీస్‌ కీలక వివరాలు లీక్‌.. ఎప్పుడు విడుదల కానుంది..?

శాంసంగ్‌ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025 (Galaxy Unpacked 2025) ఈవెంట్‌ రేపు జరగనుంది. భారత కాలమానం ప్రకారం 11.30 PM గంటలకు ప్రారంభం కానుంది. ఈవెంట్‌లో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్‌ (Samsung Galaxy S25 series) విడుదల కానుందని అంచనా వేస్తున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్‌, గెలాక్సీ S25 అల్ట్రా మోడళ్లు లాంచ్‌ కానున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్‌లకు సంబంధించిన అనేక వివరాలు లీక్‌ అయ్యాయి. తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ల ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్‌ల వివరాలు లీక్ అయ్యాయి.

గెలాక్సీ S25 సిరీస్‌ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లతో లాంచ్‌ కానుందని శాంసంగ్‌ గతంలోనే వెల్లడించింది. అయితే తాజాగా టిప్‌స్టర్‌ Evan Blass ఈ వివరాలను లీక్‌ చేశారు. దీని ఆధారంగా త్వరలో విడుదల కానున్న శాంసంగ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు అనేక AI ఫీచర్‌లను కలిగి ఉంటాయి.

Samsung Galaxy S25 series

గెలాక్సీ S25 సిరీస్ Gemini AI తో ఇంటిగ్రేట్‌ చేయబడి ఉంటుంది. ఫలితంగా మీకు కావాల్సిన సమాచారం కోసం గంటల తరబడి వెతికే అవసరం ఉండదు. చాలా తక్కువ సమయంలో కచ్చితమైన సమాచారాన్ని పొందవచ్చు. దీంతోపాటు పిక్సల్‌ స్టైల్డ్‌ ఆడియో ఎరేజర్‌ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది.

దీంతోపాటు AI ఆధారిత నైట్‌ వీడియో మోడ్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీని ద్వారా నాయిస్‌ లేకుండా బ్రైట్‌నెస్‌తో వీడియోలను క్యాప్చర్‌ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. చిన్న చిన్న స్టెప్ట్స్‌తో ఇది సాధ్యమని సమాచారం. అయితే ఇప్పటికే శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు నైట్‌ మోడ్‌ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. అయితే ఈ కొత్త ఫీచర్ ఎలాంటి మెరుగైన పనితీరు కనబరచనుందో తెలియాల్సి ఉంది.

ఇటీవలే ఈ సిరీస్ ధరల వివరాలు లీక్‌ అయ్యాయి. ఈ సిరీస్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ Elite ప్రాసెసర్‌తో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. మరియు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OneUI 7 తో పనిచేయనుంది. గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్‌ మోడళ్లు సిల్వర్‌, ఐసీ బ్లూ, మింట్‌, నేవీ రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

టిప్‌స్టర్‌ తరుణ్ వాట్స్‌ ధరలను లీక్‌ చేశారు. గెలాక్సీ S25 ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.84,999 గా ఉండే అవకాశం ఉంది. మరియు 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ రూ.94,999 కు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

గెలాక్సీ S25 ప్లస్‌ మోడల్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,04,999, 12GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,14,999 గా ఉంటుందని తెలుస్తోంది. అల్ట్రా వేరియంట్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.1,34,999, 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ ధర రూ.1,44,999, 16GB ర్యామ్ + 1TB స్టోరేజీ ధర రూ.1,64,999 గా ఉండే అవకాశం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ 2025 ఈవెంట్‌ ప్రపంచవ్యాప్తంగా జనవరి 22న జరగనుంది. భారత్‌లో 11.30PM గంటలకు ఈవెంట్‌ ప్రారంభం కానుంది. శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌, యూట్యూబ్ ఛానల్, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా లైవ్ చూడవచ్చు. ఈ ఈవెంట్‌ వేదికగా అనేక కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S25 series AI features leaked ahead of expected launch on Galaxy Unpacked 2025 event
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X