ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ S25 సిరీస్ లాంచ్.. ధరలు, ప్రీ-ఆర్డర్ ఆఫర్లు, అవైలబిలిటీ వివరాలివే..
Samsung Galaxy S25 Series: శామ్‌సంగ్ తన సరికొత్త గెలాక్సీ S25 సిరీస్‌ను ఈ సంవత్సరం మొదటి గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో గెలాక్సీ S25, గెలాక్సీ S25+, గెలాక్సీ S25 అల్ట్రా వంటి మూడు మోడల్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తర్వాత, శామ్‌సంగ్ ఇండియాలో వీటి ధరలను, ప్రీ-ఆర్డర్ వివరాలను ప్రకటించింది.

* భారతదేశంలో గెలాక్సీ S25 సిరీస్ ధరలు
- గెలాక్సీ S25
12GB + 256GB: రూ.80,999
12GB + 512GB: రూ.92,999
కలర్స్: ఐసీ బ్లూ, సిల్వర్ షాడో, నేవీ, మింట్
- గెలాక్సీ S25+
12GB + 256GB: రూ.99,999
12GB + 512GB: రూ.1,11,999
కలర్స్: నేవీ, సిల్వర్ షాడో
- గెలాక్సీ S25 అల్ట్రా
12GB + 256GB: రూ.1,29,999
12GB + 512GB: రూ.1,41,999
12GB + 1TB: రూ.1,65,999 (టైటానియం సిల్వర్‌బ్లూ రంగులో మాత్రమే అందుబాటులో ఉంటుంది).
కలర్స్: టైటానియం సిల్వర్‌బ్లూ, టైటానియం గ్రే, టైటానియం వైట్‌సిల్వర్, టైటానియం బ్లాక్
గత మోడళ్లతో పోలిస్తే గెలాక్సీ S25, గెలాక్సీ S25+ ధరలు రూ.1,000 పెరిగాయి. గెలాక్సీ S25 అల్ట్రా బేస్ వేరియంట్ ధర ఓల్డ్ మోడల్‌తో సమానంగా ఉంది, కానీ 512GB, 1TB మోడళ్ల ధరలు వరుసగా రూ.2,000, రూ.6,000 పెరిగాయి.
* స్పెసిఫికేషన్లు
గెలాక్సీ S25: 6.2-అంగుళాల డిస్‌ప్లే, 4,000mAh బ్యాటరీ, 25W వైర్డ్ ఛార్జింగ్.
గెలాక్సీ S25+: 6.7-అంగుళాల డిస్‌ప్లే, 4,900mAh బ్యాటరీ, 45W వైర్డ్ ఛార్జింగ్
కెమెరాలు (రెండు మోడళ్లలోనూ)
50MP ప్రధాన కెమెరా
12MP అల్ట్రా-వైడ్ లెన్స్
10MP టెలిఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్)
* సాఫ్ట్‌వేర్, చిప్‌సెట్
One UI 7తో ఆండ్రాయిడ్ 15, Snapdragon 8 Elite ప్రాసెసర్ తో ఈ ఫోన్లు వస్తున్నాయి. RAM విషయానికొస్తే అన్ని మోడళ్లకు 12GB RAM స్టాండర్డ్.
* గెలాక్సీ S25 అల్ట్రా ప్రత్యేకతలు
అందమైన ప్రీమియం డిజైన్, 1TB వరకు స్టోరేజ్.
* ప్రీ-ఆర్డర్ ఆఫర్లు
- గెలాక్సీ S25 అల్ట్రా
గెలాక్సీ S25 అల్ట్రాపై రూ.21,000 విలువైన బెనిఫిట్స్ ఉన్నాయి. రూ.12,000 విలువైన స్టోరేజ్ అప్‌గ్రేడ్ వస్తుంది, అంటే 256GB ధరకు 512GB వేరియంట్ పొందవచ్చు. రూ.9,000 అప్‌గ్రేడ్ బోనస్ కూడా ఉంది. 9 నెలల నో-కాస్ట్ EMI ప్లాన్‌తో రూ.7,000 క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు.
- గెలాక్సీ S25+
రూ.12,000 విలువైన బెనిఫిట్స్, ఇందులో ఫ్రీ స్టోరేజ్ అప్‌గ్రేడ్ (256GB ధరకు 512GB) కూడా ఉంది.
- గెలాక్సీ S25
రూ.1,000 అప్‌గ్రేడ్ బోనస్‌గా పొందవచ్చు. 9 నెలల నో-కాస్ట్ EMI ప్లాన్‌తో రూ.7,000 క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. అన్ని మోడళ్లపై ప్రముఖ NBFCల ద్వారా 24 నెలల నో-కాస్ట్ EMI అందుబాటులో ఉంది.
* అవైలబిలిటీ
గెలాక్సీ S25 సిరీస్ ప్రీ-ఆర్డర్లు జనవరి 23 నుంచి ప్రారంభమవుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్లను ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో లేదా శాంసంగ్ లైవ్ ద్వారా ప్రీ-బుక్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








