Home
Mobile

శామ్‌సంగ్ గెలాక్సీ S25 సిరీస్ ధరలు లీక్.. జేబుకు చిల్లు పెట్టేలా ఉన్నాయ్..?

By Ram Kumar

శామ్‌సంగ్ సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ S25 కోసం ప్రపంచవ్యాప్తంగా టెక్ లవర్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కంపెనీ ఈ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ S25, గెలాక్సీ S25+, గెలాక్సీ S25 అల్ట్రాలను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.

2025, జనవరి 22న జరగనున్న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఈ ఫోన్లు ప్రపంచానికి పరిచయం కానున్నాయి. అంతేకాదు, ఈసారి మరో సర్‌ప్రైజ్ ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బహుశా గెలాక్సీ S25 స్లిమ్ అనే మరో మోడల్ కూడా ఈసారి లైన్‌లో ఉండొచ్చు.

Samsung Galaxy S25 Series Price Leaked  Higher Costs Ahead of January 22 Launch

* యూరప్ ధరలు లీక్.. ఇండియాలో ఎంత ఉండొచ్చు?

ఇప్పటికే యూరప్‌లో ఈ ఫోన్ల ధరలు లీక్ అయ్యాయి. యూరప్ ధరలు, ఇండియా ధరలు కాస్త అటూ ఇటూగా ఉన్నా, ఓ అంచనాకు రావడానికి ఇవి ఉపయోగపడతాయి.

లీకైన వివరాల ప్రకారం గెలాక్సీ S25 బేస్ మోడల్ (128GB) ధర దాదాపు 964 యూరోలు (సుమారు రూ.85,000) ఉండొచ్చు. ఇక 256GB వేరియంట్ ధర 1,026 యూరోలు (సుమారు రూ 91,000), టాప్ ఎండ్ 512GB వేరియంట్ ధర 1,151 యూరోలు (సుమారు రూ.1,01,000) వరకు ఉండొచ్చు.

గెలాక్సీ S25+ మోడల్ విషయానికి వస్తే, ఇది 128GB వేరియంట్‌తో రాకపోవచ్చు. దీని బేస్ మోడల్ 256GB కాగా, ధర 1,235 యూరోలు (సుమారు ₹1,09,000) ఉండొచ్చు. ఇక 512GB వేరియంట్ ధర 1,359 యూరోలు (సుమారు రూ.1,20,000) వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

అందరి కళ్లూ గెలాక్సీ S25 అల్ట్రా మీదే ఉన్నాయి. ఈ ఫోన్ 256GB వేరియంట్‌తో మొదలై, ధర ఏకంగా 1,557 యూరోలు (సుమారు రూ.1,38,000) ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి. ఇందులో టాప్ ఎండ్ మోడల్ 1TB స్టోరేజ్‌తో రానుండగా, దీని ధర అయితే ఊహించడానికే భయానకంగా ఉంది, 1,930 యూరోలు (సుమారు రూ.1,70,000)!

* స్టోరేజ్, రంగుల్లో వెరైటీ

ఈ ఫోన్లు స్టోరేజ్ విషయంలో మాత్రం యూజర్లకు మంచి ఆప్షన్లే ఇస్తున్నాయి. గెలాక్సీ S25 మోడల్ 128GB, 256GB, 512GB వేరియంట్లలో లభిస్తుంది. గెలాక్సీ S25+ మోడల్ 256GBతో మొదలై 512GB వరకు వెళ్తుంది. గెలాక్సీ S25 అల్ట్రా మాత్రం స్టోరేజ్ విషయంలో తగ్గేదేలే అంటోంది. ఇది ఏకంగా 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్‌తో రానుంది.

రంగుల విషయానికొస్తే, గెలాక్సీ S25, S25+ మోడల్స్ ఐసీ బ్లూ, మింట్, నేవీ, సిల్వర్ రంగుల్లో మెరిసిపోనున్నాయి. ప్రీమియం లుక్‌తో వచ్చే గెలాక్సీ S25 అల్ట్రా మాత్రం టైటానియం బ్లాక్, టైటానియం గ్రే,, టైటానియం సిల్వర్ బ్లూ వంటి ప్రత్యేకమైన రంగుల్లో రానుంది.

* కొత్త UI, ప్రీ-రిజర్వేషన్ల హడావిడి

ఈ ఫోన్లతో పాటే శామ్‌సంగ్ తన సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ One UI 7ను కూడా విడుదల చేయనుంది. ఇండియాలో గెలాక్సీ S25 ఫోన్ల కోసం ప్రీ-రిజర్వేషన్లు కూడా మొదలయ్యాయి. కేవలం రూ.1,999 చెల్లించి ఈ ఫోన్లను ముందుగా బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న వారికి రూ.5,000 విలువైన బెనిఫిట్స్ లభిస్తాయి.

అంతేకాదు, ఒకవేళ మీరు మీ నిర్ణయం మార్చుకుంటే, ఈ డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు. ప్రీ-రిజర్వేషన్ చేసుకున్న వారికి ప్రత్యేకంగా RAM, స్టోరేజ్ ఆప్షన్లు ఎంచుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ప్రత్యేకమైన రంగులను కూడా ఎంచుకోవచ్చు. పాత ఫోన్‌కు మంచి ఎక్స్చేంజ్ వాల్యూ కూడా లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S25 series launches January 22nd. Leaked European prices suggest higher costs. Pre-reservations are open with exclusive benefits.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X