Home
Mobile

శాంసంగ్‌ గెలాక్సీ S25 సిరీస్‌ కెమెరా వివరాలు లీక్‌.. 200MP ప్రైమరీ కెమెరా సహా...!!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ శాంసంగ్‌ నుంచి త్వరలో మరో గెలాక్సీ S సిరీస్‌ హ్యాండ్‌సెట్‌లు విడుదల కానున్నాయి. ఇప్పటికే గెలాక్సీ S25 సిరీస్‌ గురించి అనేక వివరాలు లీక్‌ అయ్యాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న గెలాక్సీ S24 సిరీస్‌ కూడా అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ సిరీస్‌లో (Samsung Galaxy S25 Series) భాగంగా గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్‌, గెలాక్సీ S25 అల్ట్రా సహా S25 స్లిమ్‌ హ్యాండ్‌ సెట్‌ కూడా విడుదల కానుందని తెలుస్తోంది.

శాంసంగ్‌ గెలాక్సీ S25 సిరీస్‌ కెమెరా స్పెసిఫికేషన్‌ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ లీక్స్‌ ఆధారంగా గెలాక్సీ S25 స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy S25 Smartphone) f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.2 అపేచర్‌, 120 డిగ్రీల ఫీల్డ్‌ వ్యూతో 12MP అల్ట్రావైడ్‌ కెమెరా, f/2.4 అపేచర్, 3x ఆప్టికల్‌ జూమ్‌ సామర్థ్యంతో టెలిఫొటో కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Samsung Galaxy S25 Series Smartphones leaks

దీంతోపాటు f/2.2 అపేచర్‌తో 12MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. గత మోడల్‌ తరహాలోనే కెమెరా స్పెసిఫికేషన్‌లు ఉన్నాయి. అయితే స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ చిప్‌సెట్‌ కారణంగా కొన్ని అప్‌గ్రేడ్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు ఇమేజ్‌ సిగ్నల్‌ ప్రాసెసర్‌ ను కలిగి ఉంటుందని సమాచారం.

గెలాక్సీ S25 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy S25 Plus Smartphone) ... బేస్‌ వేరియంట్‌ తరహా కెమెరా స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్లస్‌ వేరియంట్‌ 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్‌, 10MP టెలిఫొటో కెమెరా, 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉందని సమాచారం.

శాంసంగ్‌ గెలాక్సీ S25 అల్ట్రా (Samsung Galaxy S25 Ultra) వేరియంట్‌ గత మోడల్‌ కంటే మరిన్ని అప్‌గ్రేడ్‌ లను కలిగి ఉండే అవకాశం ఉంది. 200MP ప్రైమరీ కెమెరా, 50MP 5X అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే గత మోడల్‌ 12MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు S25 అల్ట్రా వేరియంట్ 10MP 3X టెలిఫొటో కెమెరా, 12MP సెల్ఫీ కెమెరాతో విడుదల కానుందని తెలుస్తోంది.

శాంసంగ్‌ గెలాక్సీ S25 సిరీస్‌లో భాగంగా S25 స్లిమ్‌ పేరుతో (Samsung Galaxy S25 Slim Smartphone) మరో హ్యాండ్‌సెట్‌ లాంచ్‌ కానుందని తెలుస్తోంది. అయితే ఏయే దేశాల్లో ఈ వేరియంట్ లాంచ్‌ కానుందో తెలియలేదు. దీంతోపాటు ఇతర మోడళ్ల తరహాలోనే నాణ్యమైన కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

గెలాక్సీ S25 సిరీస్‌ విడుదలపై పూర్తి సమాచారం వెల్లడి కాలేదు. అయితే జనవరిలో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. దీంతోపాటు ఏయే దేశాల్లో విడుదల కానుంది మరియు ఏయే స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులోకి రానుందో వెల్లడి కాలేదు. ముఖ్యంగా ఎంత ధరలో భారత్‌ మార్కెట్‌లోకి విడుదల కానుందో తెలియలేదు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S25 Series Smartphones camera specifications leaked expected to launch soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X