Home
Mobile

శాంసంగ్‌ గెలాక్సీ S25 సిరీస్ ధరల వివరాలు లీక్.. భారత్‌ మార్కెట్‌లో రెండు రోజుల్లో విడుదల..!

శాంసంగ్ నుంచి గెలాక్సీ S25 సిరీస్‌ (Samsung Galaxy S25 Series) లాంచ్ కానుంది. జనవరి 22 న నిర్వహించనున్న అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ 2025 లో (Galaxy Unpacked 2025) భాగంగా ఈ సిరీస్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్, గెలాక్సీ S25 అల్ట్రా హ్యాండ్‌సెట్‌లు అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటు గెలాక్సీ రింగ్ సహా XR హెడ్‌సెట్‌ పై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే గెలాక్సీ S25 సిరీస్‌ కు సంబంధించిన అనేక వివరాలు ఇప్పటికే లీక్‌ అయ్యాయి.

ఎప్పుడు విడుదల కానుంది? :
తాజాగా ఈ సిరీస్‌ ధరలు లీక్ అయ్యాయి. అయితే గెలాక్సీ S24 సిరీస్‌ కంటే అధిక ధరలకు కలిగి ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ వివరాలను X యూజర్‌ తరుణ్‌ వాట్స్‌ (@tarunvats33) వెల్లడించారు. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌ డిజైన్‌, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు లీక్‌ అయ్యాయి. భారత్‌లో గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ జనవరి 22వ తేదీ 11.30 PM కు ప్రారంభం కానుంది. శాంసంగ్‌ వెబ్‌సైట్‌, సోషల్‌ మీడియా ప్లా్ట్‌ఫాంల ద్వారా లైవ్‌ చూడవచ్చు.

Samsung Galaxy S25 series Smartphones

గెలాక్సీ S25 సిరీస్‌ ధరలు లీక్‌ :
తరుణ్ వాట్స్‌ వివరాల ఆధారంగా శాంసంగ్‌ గెలాక్సీ S25 ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.84,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.94,999 గా ఉంటుందని తెలుస్తోంది. అదే గెలాక్సీ s25 ప్లస్‌ మోడల్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,04,999 గా ఉండే అవకాశం ఉంది.

అదే 12GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,14,999 గా ఉంటుందని తెలుస్తోంది. అదే గెలాక్సీ S25 అల్ట్రా వేరియంట్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.1,34,999, 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ ధర రూ.1,44,999 మరియు 16GB ర్యామ్ + 1TB స్టోరేజీ ధర రూ.1,64,999 గా ఉండే అవకాశం ఉంది.

ప్రీ బుకింగ్‌ :
శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్‌ ను ముందస్తు రిజర్వేషన్‌ చేసుకొనే అవకాశం కల్పించింది. శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌, శాంసంగ్‌ స్టోర్స్‌, శాంసంగ్‌ ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌ ద్వారా ప్రీ బుకింగ్‌ చేసుకోవచ్చు. రూ.1999 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రీ బుకింగ్‌ చేసుకున్న వారికి అదనపు ప్రయోజనాలను అందించనున్నట్లు సంస్థ ఇప్పటికే వెల్లడించింది.

స్పెసిఫికేషన్‌లు :
గెలాక్సీ S25 సిరీస్‌ ఫ్లాష్‌ సైడ్స్‌తో కూడిన స్లీకర్‌ ఫ్రేమ్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ సిరీస్‌ బేస్‌ వేరియంట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.3 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 2600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

ఈ ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 4 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 శాంసంగ్‌ OneUI ను కలిగి ఉంటుందని సమాచారం. ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP వైడ్‌ యాంగిల్‌, 10MP టెలిఫోటో, 12MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరాలతో విడుదల అయ్యే అవకాశం ఉంది. 4000mAh బ్యాటరీతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S25 series Smartphones price leaked ahead of launch expected on january 22 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X