శాంసంగ్ గెలాక్సీ S25 స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. ఈ గుడ్‌న్యూస్ మీ కోసమే..!!
టెక్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ (Galaxy Unpacked 2025) నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్, గెలాక్సీ S25 అల్ట్ర్రా మోడళ్లు లాంచ్ అయ్యాయి. అయితే తాజాగా ఈ సిరీస్ గురించి ఓ ఆసక్తికర లీక్ వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ 256GB, 512GB స్టోరేజీ వేరియంట్స్‌లోనే అందుబాటులోకి వచ్చాయి. త్వరలో ఈ ఫోన్ 128GB స్టోరేజీ వేరియంట్ (Samsung Galaxy S25 New Variant) కూడా విడుదల కానుందని తెలుస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ S25 స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ :
శాంసంగ్ గెలాక్సీ S25 స్మార్ట్‌ఫోన్ 128GB స్టోరేజీ వేరియంట్ గుర్తించి 91Mobiles.com వెల్లడించింది. అయితే శాంసంగ్ ఈ వేరియంట్ పై ఎటువంటి ప్రకటన చేయలేదు. అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఎటువంటి సమాచారం లేదు. ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ధర ఎలా ఉండనుంది! :
భారత్ మార్కెట్‌లో ఈ 128GB స్టోరేజీ వేరియంట్ (Samsung Galaxy S25 128GB Variant price) ధర రూ.74,999 గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఎప్పటి నుంచి సేల్ ప్రారంభం కానుందో వెల్లడి కాలేదు. అయితే 256GB, 512GB స్టోరేజీ తరహాలోనే స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు వేరియంట్‌ల సేల్ ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం కానుంది.
ఇతర వేరియంట్‌ల వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ S25 స్మా్ర్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.80,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.92,999 గా ఉంది. ఐకీ బ్లూ, మింట్, నేవీ, సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. అదే శాంసంగ్ వెబ్‌సైట్ లో ఎక్లూజివ్‌గా బ్లూబ్లాక్, కోరల్‌రెడ్, పింక్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది.
స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
శాంసంగ్ గెలాక్సీ S25 స్మార్ట్‌ఫోన్ 6.2 అంగుళాల FHD+ డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 2600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తోపాటు ఈ డిస్‌ప్లే అడాప్టివ్ కలర్ టోన్, విజన్ బూస్టర్‌ను సపోర్టు చేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 తో పనిచేస్తుంది.
ఈ ఫోన్ 7 సంవత్సరాలపాటు OS అప్‌డేట్‌లు, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందించనుంది. గూగుల్ సర్కిల్ టూ సెర్చ్, కాల్ ట్రాన్స్‌క్రిప్ట్, రైటింగ్ అసిస్టెంట్, డ్రాయింగ్ అసిస్టెంట్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉది. మరియు ఈ ఫోన్ 25W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 4000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
కెమెరాల వివరాలు :
శాంసంగ్ ఫోన్ f/1.8 అపేచర్, OIS తో 50MP వైడ్ కెమెరా, f/2.2 అపేచర్, 120 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 12MP అల్ట్రావైడ్, f/2.4 అపేచర్, 3X ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు 12MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది.
కనెక్టివిటీ పరంగా గెలాక్సీ S25 స్మార్ట్‌ఫోన్ 5G, 4G LTE, WiFi 6E, బ్లూటూత్ 5.3, NFC, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌గా ఉంది.


Click it and Unblock the Notifications








