శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ డిజైన్, కెమెరా మాడ్యూల్ సహా కీలక వివరాలు లీక్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్ నుంచి వచ్చే సంవత్సరం జనవరిలో గెలాక్సీ S25 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ఈ సంవత్సరం జనవరిలో లాంచ్ అయిన గెలాక్సీ S24 సిరీస్‌కు తర్వాత తరం వెర్షన్ గా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. తాజాగా ఈ గెలాక్సీ S25 సిరీస్ అల్ట్రా మోడల్ (Samsung Galaxy S25 Ultra Smartphone) డిజైన్ సహా కీలక వివరాలు లీక్ అయ్యాయి. దీంతోపాటు కలర్ వేరియంట్‌ల వివరాలు కూడా లీక్ అయ్యాయి.
డిజైన్, కెమెరాలు వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ డిజైన్ వివరాలు ఆధారంగా కెమెరా వివరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. గత మోడళ్లు మాదిరిగానే ఈ అప్‌కమింగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ల ను కలిగి ఉంటుంది. టిప్‌స్టర్ Technizo Concept తన X (ట్విట్టర్) లో డిజైన్, కలర్ వేరియంట్ల వివరాలను విడుదల చేశారు.

ఫ్లాట్ ఎడ్జ్‌లు! :
దీని ఆధారంగా ఈ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని కీలక మార్పులను గమనించవచ్చు. ఫోన్ చివరి భాగాలు వృత్తాకారంగా ఉన్నాయి. మరియు ఫ్లాట్ ఎడ్జ్ లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు కెమెరా మాడ్యూల్ డిజైన్ లీక్ అయింది. ట్వీక్ డిజైన్ ను కలిగి ఉంటుందని సమాచారం. వెనుక వైపు కెమెరాలకు వృత్తాకార రింగ్స్‌ను (Thicker RIngs) గమనించవచ్చు.
నాలుగు రంగుల్లో :
దీంతోపాటు ఈ అల్ట్రా హ్యాండ్‌సెట్ నాలుగు రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది. టైటానియం గ్లే, టైటానియం సిల్వర్, టైటానియం బ్లూ, టైటానియం బ్లాక్ రంగుల్లో విడుదల కానుందని తెలుస్తోంది. ఇటీవల ఈ హ్యాండ్‌సెట్ గీక్‌బెంచ్ లో కనిపించింది. ఫలితంగా స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్ తో అందుబాటులోకి రానుందని సమాచారం.
Galaxy S25 Ultra Colors
— Technizo Concept (@technizoconcept) November 7, 2024
Titanium Black
Titanium Blue
Titanium Gray
Titanium Silver pic.twitter.com/oZdaQeQZ7a
గెలాక్సీ AI ఫీచర్‌లు :
తాజాగా లీకైన వివరాల ఆధారంగా ఈ అల్ట్రా మోడల్ హ్యాండ్‌సెట్ ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత గెలాక్సీ AI ఫీచర్‌లను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ S పెన్ ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది.
డిస్‌ప్లే, కెమెరా అంచనా స్పెసిఫికేషన్‌లు :
ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన కొన్ని నివేదికల ఆధారంగా గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 6.86 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. గత మోడళ్ల కంటే సన్నని బెజెల్స్‌తో లాంచ్ కానుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 45W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
కెమెరా విభాగం పరంగా మెరుగైన స్పెసిఫికేషన్ లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 200MP ప్రైమరీ కెమెరా, 3X జూమింగ్ సామర్థ్యంతో 10MP టెలిఫోటో కెమెరా, 5X జూమ్ సామర్థ్యంతో 50MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 50MP అల్ట్రా వైడ్ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








