Home
Mobile

200MP కెమెరా శాంసంగ్‌ గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌పై రూ.12000 డిస్కౌంట్‌.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!

Samsung Galaxy S25 Ultra 5G Smartphone : శాంసంగ్ ఈ సంవత్సరం జనవరిలో ఫ్లాగ్‌షిప్‌ సిరీస్‌ గెలాక్సీ S25 ఫోన్లను లాంచ్‌ చేసింది. ఇందులో గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్‌, గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే లిమిటెడ్‌ టైం డిస్కౌంట్‌ ఆఫర్‌లో భాగంగా శాంసంగ్‌ గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసిన వారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

రూ.12 వేలు తగ్గింపు..! :
శాంసంగ్‌ గెలాక్సీ S25 స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ భారత్‌ మార్కెట్‌లో రూ.1,29,999 ధరకు విడుదల అయింది. ప్రస్తుతం లిమిటెడ్‌ టైం ఆఫర్‌ లో భాగంగా రూ.12 వేల డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ వేరియంట్‌ను రూ.1,17,999 కే సొంతం చేసుకోవచ్చు.

Samsung galaxy S25 ultra smartphone price in india

ఆఫర్‌ కొన్నిరోజులు మాత్రమే :
అదే విధంగా 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.1,29,999, 12GB ర్యామ్ + 1TB స్టోరేజీ వేరియంట్‌ను రూ.1,53,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ జూన్‌ 14 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ టైటానియం బ్లాక్‌, సిల్వర్‌ బ్లూ, వైట్‌ బ్లూ, గ్రే కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

6.9 అంగుళాల డిస్‌ప్లే :
శాంసంగ్‌ గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల డైనమిక్‌ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరెల్లా గ్లాస్‌ ఆర్మర్‌ 2 ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 45W వైర్‌ ఛార్జింగ్‌, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

స్నాప్‌డ్రాగన్‌ 8 Elite చిప్‌సెట్‌ :
ఆ అల్ట్రా వేరియంట్‌ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్‌ 8 Elite చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 7 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్‌ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

Samsung galaxy S25 ultra smartphone price in india

200MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్‌ బెస్ట్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. వెనుక వైపు నాలుగు కెమెరాలను అమర్చారు. 200MP OIS కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ కెమెరా, 5x ఆప్టికల్‌ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్‌, 3x ఆప్టికల్‌ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. 12MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.

IP68 రేటింగ్‌ :
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, WiFi 7, NFC, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మరియు IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ ప్రూఫ్‌గా ఉంది. ఈ గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ శాంసంగ్ S పెన్‌ను సపోర్టు చేస్తుంది.

Best Mobiles in India

English summary
Samsung galaxy S25 ultra smartphone gets rs12000 discount in india upto june 14 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X