200MP +50MP +50MP +10MP కెమెరాలు, S Pen, 7 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌తో Samsung ఫోన్..!
గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్‌లో (Galaxy Unpacked 2025) శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్, గెలాక్సీ S25 అల్ట్రా హ్యాండ్‌సెట్‌లు విడుదల అయ్యాయి. మిగిలిన రెండు వేరియంట్‌లతో పోలిస్తే అల్ట్రా మోడల్ (Samsung Galaxy S25 Ultra Smartphone) మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ మోడల్ శాంసంగ్ S పెన్‌ను సపోర్టు చేస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ అల్ట్రా మోడల్ స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల డైనమిక్ 2X డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ డిస్‌ప్లే 1Hz - 120Hz రీఫ్రెష్ రేట్, 2600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు కార్నింగ్ గొరెల్లా గ్లాస్ ఆర్మర్ 2 రక్షణను పొందుతుంది.

7 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ను కలిగి ఉంది. మరియు కస్టమ్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 12GB ర్యా్మ్, గరిష్ఠంగా 1TB స్టోరేజీ జతచేసి ఉంటుంది. 7 ఆండ్రాయిడ్ OS, సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని శాంసంగ్ తెలిపింది. అనేక AI ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది.
200MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా అత్యంత నాణ్యమైన కెమెరాలను కలిగి ఉంది. వెనుక వైపు 4 కెమెరాను అమర్చారు. f/1,7 అపేచర్, OIS, 2x ఇన్ సెన్సార్ జూమ్‌తో 200MP కెమెరాను అమర్చారు. f/1.9 అపేచర్, 120 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 50MP అల్ట్రావైడ్ కెమెరా మరియు 5X ఆప్టికల్ జూమ్, OIS తో 50MP టెలిఫోటో కెమెరా కలిగి ఉంది.

వీటితోపాటు 3x ఆప్టికల్ జూమ్, OIS సపోర్టుతో 10MP టెలిఫోటో కెమెరాను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.2 అపేచర్‌తో 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. వీటితో అత్యంత నాణ్యమైన ఫోటోలు, వీడియోలను క్యాప్టర్ చేయవచ్చు.
శాంసంగ్ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 45W వైర్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, వైఫై 7, NFC, GPS, UWB, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. శాంసంగ్ S పెన్‌ను (Samsung S pen) సపోర్టు చేస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర $1299 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.1,12,300) గా ఉంది. అదే 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర $1419 (భారత్ కరెన్సీ ప్రకారం రూ.1,22,700), 12GB ర్యామ్ + 1TB స్టోరేజీ ధర $1,659 (భారత కరెన్సీ ప్రకారం రూ.1,43,400) గా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ టైటానియం బ్లాక్, టైటానియం గ్రే, టైటానియం సిల్వర్‌బ్లూ, టైటానియం వైట్‌సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. దీంతోపాటు శాంసంగ్ వెబ్‌సైట్‌లో మరిన్ని ప్రత్యేక కలర్ వేరియంట్స్ అందుబాటులో ఉండనున్నాయి. టైటానియం జడేగ్రీన్, టైటానియం జెట్‌బ్లాక్, టైటానియం పింక్‌గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. భారత్‌లో ధరలు సహా సేల్ తేదీ వెల్లడి కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








