శామ్‌సంగ్ గెలాక్సీ S25 సిరీస్‌లోని టాప్ 10 AI ఫీచర్లు.. వాటితో అద్భుతమైన ఉపయోగాలు..!
Samsung Galaxy S25 series: శామ్‌సంగ్ తన సరికొత్త Galaxy S25 సిరీస్‌ను ఈ ఏడాది మొదటి గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో గెలాక్సీ S25, గెలాక్సీ S25+, గెలాక్సీ S25 అల్ట్రా అనే మూడు మోడల్స్ ఉన్నాయి. ఈ ఫోన్లు మోస్ట్ అడ్వాన్స్‌డ్, యూజ్‌ఫుల్ AI ఫీచర్లతో రావడం విశేషం. ఆ ఫీచర్లేవో, యూజర్లకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.
* గెలాక్సీ S25 సిరీస్‌లోని AI ఫీచర్లు
1. ఆడియో ఎరేజర్ (Audio Eraser)
ఈ టూల్ వీడియోల్లోని ఆడియోను మెరుగుపరుస్తుంది. వాయిస్‌లు, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌తో సహా ఆరు రకాల సౌండ్స్‌ను గుర్తించి, వాటిని తగ్గించడానికి లేదా పెంచడానికి ఇది పనికొస్తుంది. గాలి శబ్దం లాంటి అన్ వాంటెడ్ సౌండ్స్‌ను తగ్గించి, ముఖ్యమైన వాయిస్‌లను పెంచవచ్చు.

2. డ్రాయింగ్ అసిస్ట్ (Drawing Assist)
గెలాక్సీ S24తో పరిచయమైన ఈ ఫీచర్‌కు ఇప్పుడు వాటర్‌కలర్, 3D కార్టూన్ అనే రెండు కొత్త డ్రాయింగ్ స్టైల్స్ జోడించారు. దీనితో మొత్తం ఆరు స్టైల్స్ అందుబాటులో ఉన్నాయి. టెక్స్ట్ లేదా రిఫరెన్స్ ఇమేజ్‌లను ఉపయోగించి డ్రాయింగ్స్‌ను రూపొందించవచ్చు.
3. మెరుగైన సర్కిల్ టు సెర్చ్ (Improved Circle to Search)
ఈ ఫీచర్ ద్వారా స్క్రీన్‌పై ఉన్న టెక్స్ట్‌ను గుర్తించవచ్చు. ఇమెయిల్ అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు లేదా వెబ్ లింక్‌లను సర్కిల్ చేస్తే, నేరుగా కాల్ చేయడం లేదా వెబ్‌పేజీకి వెళ్లడం వంటి చర్యలు తీసుకోవచ్చు.
4. జెనరేటివ్ ఎడిట్ (Generative Edit)
ఈ AI ఫీచర్ ద్వారా ఫొటోలను రీసైజ్ చేయడం, వస్తువులను మార్చడం లేదా తొలగించడం వంటి ఎడిటింగ్ పనులను చేయవచ్చు. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ కారణంగా ఇది ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేస్తుంది.
5. నౌ బ్రీఫ్ (Now Brief)
రోజులోని సమయాన్ని బట్టి ఈ ఫీచర్ ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఉదయం స్లీప్ స్కోర్, ఎనర్జీ స్కోర్, వాతావరణం, పనికి వెళ్లే ముందు ట్రాఫిక్ అప్‌డేట్లు, మీటింగ్ రిమైండర్లు, సాయంత్రం స్టెప్ కౌంట్స్ వంటి వివరాలను చూపిస్తుంది.
6. జెమిని AI యాక్సెస్ (Gemini AI Access)
పవర్ బటన్‌ను నొక్కి పట్టుకోవడం ద్వారా గూగుల్ జెమిని AI అసిస్టెంట్‌ను ఉపయోగించవచ్చు. ఇది ఫ్లైట్ షెడ్యూల్స్‌ను వెతకడం, ఈ-మెయిల్ ద్వారా వివరాలను పంపడం వంటి పనులను చేస్తుంది.
7. వన్ UI 7లో AI ఫీచర్లు
గెలాక్సీ S25 ఆండ్రాయిడ్ 15 బేస్డ్ వన్ UI 7తో పనిచేస్తుంది. AI ఏజెంట్లు మల్టిపుల్ కమాండ్స్‌ను కలిపి, పనులను సులభతరం చేస్తాయి.
8. AI సెలెక్ట్ టూల్ (AI Select Tool)
ఈ టూల్ స్క్రీన్‌పై జరుగుతున్న పని ఆధారంగా AI ఫీచర్లను సూచిస్తుంది. టెక్స్ట్‌ను సమ్మరైజ్ చేయడం లేదా స్పెల్-చెక్ చేయడం వంటి వాటికి సహాయపడుతుంది.
9. లైవ్ వీడియో (Live Video)
ఈ ఫీచర్ ద్వారా ఏదైనా పని చేస్తున్నప్పుడు రియల్ టైమ్‌లో సూచనలు పొందవచ్చు. వంట చేసేటప్పుడు, ఇది స్టెప్స్ వైజ్ సూచనలు ఇస్తుంది.
10. లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ , వాయిస్ టాస్క్‌లు (Language Translation and Voice Tasks)
ఈ AI సిస్టమ్ కాల్స్, సంభాషణల కోసం 20 భాషలలో ట్రాన్స్‌లేషన్స్ అందిస్తుంది. వాయిస్ కమాండ్స్‌తో బ్లూ లైట్ ఫిల్టర్లను ఆన్ చేయడం వంటి ఫీచర్లను ఉపయోగించవచ్చు.
* మెరుగైన పనితీరు
గెలాక్సీ S25 ఫోన్ "స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఫర్ గెలాక్సీ" ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 37% వేగవంతమైన CPU పనితీరు, 30% మెరుగైన GPU సామర్థ్యాలను, 40% NPU వేగంతో AI ప్రాసెసింగ్‌ను అందిస్తుంది. ఈ కొత్త ఫీచర్లతో, Galaxy S25 సిరీస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


Click it and Unblock the Notifications








