Home
Mobile

Samsung Galaxy S26 Series : శాంసంగ్‌ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు వచ్చేశాయి..!

గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ 2026 ఈవెంట్‌లో శాంసంగ్‌ గెలాక్సీ S26 సిరీస్‌ విడుదల అయింది. ఇందులో భాగంగా గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్, గెలాక్సీ S26 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. S26, S26 ప్లస్‌ వేరియంట్స్ Exynos 2600 చిప్‌సెట్‌ను కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ప్రస్తుతం ముందస్తు బుకింగ్‌ చేసుకొనేందుకు అందుబాటులో ఉన్నాయి.

గెలాక్సీ 26, S26+ స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ S26 స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy S26) 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.3 అంగుళాల ఫుల్ HD+ డైనమిక్‌ అమోలెడ్ 2x డిస్‌ప్లేను కలిగి ఉంది. అదే గెలాక్సీ S26 ప్లస్ వేరియంట్ (Samsung Galaxy S26 Plus) 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల డైనమిక్‌ అమోలెడ్‌ 2x డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ రెండు ఫోన్‌లు కార్నింగ్ గొరిల్లా ఆర్మర్‌ 2 ప్రొటెక్షన్‌ను పొందుతాయి.

Samsung Galaxy S26  S26 plus

7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ రెండు మోడల్స్ 2nm Exynos 2600 చిప్‌సెట్‌ను కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత One UI 8.5 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్లు 7 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతాయి. అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లు ఉన్నాయి.

మూడు కెమెరాలు :
ఈ రెండు మోడల్స్‌ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరా యూనిట్‌ను కలిగి ఉన్నాయి. ఇందులో OIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 3X ఆప్టికల్‌ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్‌ (OIS), 120 డిగ్రీల ఫీల్డ్‌ వ్యూతో 12MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్ ఉంది.

సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాను అమర్చారు. ఈ రెండు ఫోన్‌ల వెనుక కెమెరాలతో 8K వీడియోలను రికార్డు చేయవచ్చు. అదే సెల్ఫీ కెమెరాతో 4K వీడియోలను రికార్డు చేయవచ్చు.

బ్యాటరీ, ఛార్జింగ్‌ వివరాలు :
గెలాక్సీ S26 స్మార్ట్‌ఫోన్ 25W వైర్, వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్టుతో 4300mAh బ్యాటరీని కలిగి ఉంది. అదే ప్లస్‌ వేరియంట్ 45W వైర్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4900mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్‌ 6, వైఫై 7, GPS, QZSS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు ఇ-కంపాస్‌, గైరోస్కోప్‌, యాక్సెలిరోమీటర్‌, బారోమీటర్‌, ప్రాక్సిమిటీ సెన్సర్‌లు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్ ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ S26, S26 ప్లస్‌ ధర, సేల్‌ వివరాలు :
గెలాక్సీ S26 స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.87999 గా ఉంది. 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.107999 గా ఉంది. గెలాక్సీ S26 ప్లస్‌ మోడల్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,19,999 గా ఉంది. 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.1,39,999 గా ఉంది.

ఈ రెండు ఫోన్‌లను ప్రస్తుతం ముందస్తు బుకింగ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది. వీరికి మార్చి 6 వ తేదీ నుంచి డెలివరీ చేయనున్నారు. ముందస్తు బుకింగ్‌ చేసుకున్న వారికి 256GB స్టోరేజీ ధరకే 512GB స్టోరేజీని అందిస్తారు. దీంతోపాటు అనేక ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. మార్చి 11 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. బ్లాక్‌, బ్లూ, వైట్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S26, S26 plus smartphones launched with Exynos 2600 Chip in india full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X